ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టెన్త్ క్లాస్ టర్నింగ్ పాయింట్. అందుకే తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పదవ తరగతి హాల్ టికెట్స్ ను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా సంబంధిత స్కూల్స్ కి హల్ టికెట్స్ పాఠశాల విద్యాశాఖ చేరవేసింది. 2025 టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈరోజు (మార్చి 7) నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read:Jaishankar security breach: “యూకే ఉదాసీనత”.. జైశంకర్ భద్రతా ఉల్లంఘనపై భారత్ కామెంట్స్..
SSC బోర్డు వెబ్ సైట్ (www.bse.telangana.gov.in) లోనూ హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఈ సైట్ ని సందర్శించి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరతగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే (ఫోన్ నంబర్: 040-23230942) సంప్రదించాలని కోరారు.
Also Read:Karnataka Budget: ఆధునిక “ముస్లిం లీగ్” బడ్జెట్.. కర్ణాటక బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు..
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చి 21 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 – ఇంగ్లీష్
మార్చి 26 – మ్యాథ్స్
మార్చి 28 – ఫిజిక్స్
మార్చి 29 – బయాలజీ
ఏప్రిల్ 2 – సోషల్ స్టడీస్