BRSV: హనుమకొండ జిల్లాలో ఉద్రిక్త వాతావణం నెలకొంది. కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వి నేతల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్వీ నేతలు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అక్కడున్న బీజేపీ ఫ్లెక్సీలను సైతం దగ్దం చేసేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
Read also: Karnataka: బీజేపీలో అంతర్గత కలహాలు.. జగదీష్ షెట్టర్ నిర్ణయంపై ఉత్కంఠ
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ వరంగల్‌లో నిరుద్యోగ యాత్ర నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీంనగర్, పెట్రోల్ పంప్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది. 17 షరతులు విధిస్తూ బీజేపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రహదారికి ఒకవైపు మాత్రమే ర్యాలీ నిర్వహించాలి. ఈ ర్యాలీలో నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొననుండటంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్