NTV Telugu Site icon

MIM V/s BRS: అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ కేటీఆర్.. గొంతు చించుకున్నంత మాత్రాన..

Ktr Mim

Ktr Mim

MIM V/s BRS: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నగర అభివృద్ధి పై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ పై మంత్రి కేటీఆర్ సీరియస్‌ అయ్యారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని మండిపడ్డారు. సభా నాయకుడు బీఏసీ కి రాలేదని నిందా పూర్వకంగా మాట్లాడడం తగదని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీ.ఏ.సీ కి వెళ్ళారు, అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం భావ్యం కాదని అన్నారు. అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కొవిడ్‌ ను మరచిపోయారు అంటూ సెటైర్‌ వేశారు మంత్రి కేటీఆర్‌ దీంతో కాసేపు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ కేటీఆర్ గా కొనసాగింది.

అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఏం మాట్లాడారంటే..

అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉర్దూకు రెండవ అధికార భాషా తెలంగాణ సర్కార్ ఇచ్చిందని, కానీ ఉర్దూకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణం ఏ స్టేజిలో ఉందో చెప్పాలని శాసన సభలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందనలు చెబుతాం…పనులు కాక పోతే మాట్లాడతామన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీలు కడుతున్నారు. మంచిదే…మరి హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఎంటి ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి… పాతబస్తీ లో ఆ స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇంకా ఎంత కాలం కావాలి ? అని ప్రశ్నించారు అక్బరుద్దీన్‌. పాతబస్తీ లో మెట్రో సంగతి ఎంటి ? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ లో ప్రభుత్వం హామీలు ఇస్తుంది …వాటిని అమలు చేయదా ? అన్నారు. సీఎం కేసీఅర్, మంత్రులు బిజీగా ఉంటారు..మాకు తెలుసు, మీరు చప్రసి అయిన చూపించండి … తెలంగాణ కోసం, పాతబస్తీ వారిని అయిన కలుస్తామన్నారు.

Read also: MIM Akbaruddin Owaisi: ఉర్దూకి అన్యాయం.. పాతబస్తీలో మెట్రో సంగతి ఏంటి?

అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడుపుతున్నారు. నేను BAC సమావేశంకు రాలేదు… లెటర్ పంపాను…కేసీఅర్ కూడా రాలేదు మీటింగ్ కు అన్నారు. నొట్ల రద్దు , GST కి మద్దతు వద్దు అన్నామని, కేసీఅర్ ఏమి కాదు…అంతా మంచి జరుగుతుంది అన్నారు. ప్రధాన మంత్రి నీ అలా అనడం సరికాదని కేసీఅర్ ..నన్ను అన్నారని తెలిపారు. అన్యాయం జరుగుతోందని మొదటి నుంచి మేము చెబితే సీఎం అలా జరగదని అన్నారు. భాజపాకు మద్దతిచ్చారు, రాష్ట్రానికి ఏమి వచ్చింది ? అంటూ ప్రశ్నించారు అక్బరుద్దీన్‌. BRS పెట్టినందుకు అభినందనలు. మమ్మల్ని బీ టీమ్ అన్నారు… ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలో వెళ్లారు. ఏ టీమ్ అంటారో? రెండు పార్టీలు మాత్రమే ఉండాలని కొందరు అనుకుంటారని సెటైర్‌ వేశారు. పాత బస్తిని ఇస్తాంబుల్ చేస్తామని కేసీఅర్ అన్నారు …కానీ ఉన్న స్థాయిలో అభివృద్ధి చేయండని అన్నారు. హైదరాబాద్ నగరంలో నేరాలు పెరుగుతున్నాయి.. 70 శాతం సిసిటివి కెమేరాల నిర్వహణ సరిగ్గా లేదని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ చేయండి, హైదరాబాద్ పాతబస్తీ లో మెట్రో పూర్తి చేయండని కోరారు. PRC ఎప్పుడు ఇస్తారు ? కొత్త నగరంలా …పాతబస్తీ నీ అభివృద్ధి చేయండని తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు … అమలు చేయండి అని అక్బరుద్దీ శాసన సభలో ప్రశ్నల వర్షం కురిపించారు.

పూర్తీ వీడియోకై..

Show comments