NTV Telugu Site icon

BRS Meeting: నేడు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్​ఎస్​ కీలక సమావేశం.. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులపై చర్చ..

Kcr Meting

Kcr Meting

BRS Meeting: ఈరోజు భారత రాష్ట్ర సమితి, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లను సమావేశానికి ఆహ్వానించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలు ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన ప్రచార ప్రణాళికతోపాటు పార్టీ చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పార్టీ నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులను ఈ సమావేశంలో ఖండించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ తీరుతో పాటు జాతీయ స్థాయిలో బీఆర్ ఎస్ విస్తరణ సహా ఇతర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Read also: CM KCR: నూతన సచివాలయాన్ని పరిశీలించిన కేసీఆర్.. జూన్ లో ప్రారంభం?

రాష్ట్ర పాలనకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో కేసీఆర్ అన్నారు. తనపై, రాష్ట్రంపై బీజేపీ కక్ష రాజకీయాలు చేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మంత్రులకు అండగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పన్నులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, బీజేపీ వ్యూహాలను తుంగలో తొక్కుతుందన్నారు. ఈడీ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గవర్నర్ వద్ద పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ తన వద్దే ఉంచుకున్నారని ఆక్షేపించారు. ఈ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేశామని.. రాష్ట్రపతి వద్దకు వెళ్లే విషయమై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ గెలుపుపై ​​పార్టీ నేతలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
Shocking news: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్

Show comments