NTV Telugu Site icon

BRS News Paper In AP: త్వరలోనే అక్కడ బీఆర్ఎస్ న్యూస్ పేపర్..?

Brs News Paper

Brs News Paper

BRS News Paper: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రో ఇస్తున్న సంగతి అందిరకీ తెలిసిందే. ఈ ప్రణాళికల్లో భాగంగా..ఆయన కొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించిన కేసీఆర్‌ అందులో మరో తెలుగు రాష్ట్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌ కూడాఉంది. అయితే ఇప్పటికే ఏపీలో బీఆర్‌ఎస్‌ విస్తరణపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. అయితే ఇప్పటికే పలువురు ఏపీ నేతలు కూడా బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకప్పుకున్నారు అందులో తోట చంద్రశేఖర్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు కూడా. ఇక పార్టీలో చేరిన రావెల కిషోర్‌, పార్థసారథి, పలు నేతలకు కూడా కేసీఆర్‌ పలు బాధ్యతలు అప్పజెప్పారు. కాగా.. ఏపీలో పార్టీ విస్తరణలో భాగంగా అక్కడ తమకు అనుకూల మీడియా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read also: Cyber fraud: కరెంట్‌ బిల్లు పేరిట సైబర్ మోసం.. ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు

ఈనేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయమే. ఇక.. నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌.. ఉద్యమ సమయంలో కూడా కీలక భూమిక పోషించారు. ఇందులో భాగంగానే వీటికి అనుబంధంగా తెలంగాణ టుడే అనే ఇంగ్లీష్ దినపత్రిక కూడా ఉంది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఇదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక న్యూస్ పేపర్‌ను తీసుకురావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నమస్తే తెలంగాణ యాజమాన్యం తోనే ‘‘నమస్తే ఆంధ్రప్రదేశ్’’ పేరుతో పత్రికను తీసుకురానున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో.. ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలతో.. పార్టీ నాయకుల కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ద్వారా ప్రజల్లో ఆదరణ సంపాదించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీలో కూడా బీఆర్ఎస్‌ న్యూస్‌ పేపర్‌ ప్రారంభమైతే బీఆర్ఎస్‌ న్యూస్‌ లతో సహా బీఆర్‌ఎస్‌ హవా మామూలుగా ఉండదని పార్టీ వర్గాల్లో టాక్‌. కొంత మంది నమస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రతిక ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు.
High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ

Show comments