Site icon NTV Telugu

MLA Vivekanand Goud: గేట్లుతెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదు

Brs Mla Vivekanand Goud Fires On Congress

Brs Mla Vivekanand Goud Fires On Congress

MLA Vivekanand Goud: గేట్లుతెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలు కాదని ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము గెట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వస్తారని అంటున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం మాటల్ని ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఏదో అభద్రతాభావంలో ఉన్నారని తెలిపారు. మోడీని రేవంత్ రెడ్డి బాడా బాయి అన్నారు. కాంగ్రెస్ పార్టీనేతలే మా ప్రభుత్వం ఏప్పుడు కూలుతుందో తెలువని పరిస్థితి అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నుంచే ఏక్ నాథ్ షిండేలు వస్తారని బీజేపీ నేతలు అంటున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డికి సొంత పార్టీపైనే పట్టులేకుండా భయంభయంగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం గత పండేంద్ల పాలనలో జరిగిన పనులు ఆపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పాలన సరిగ్గా చేయలేత ఎంపీ ఎన్నికలతో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గతంలో వేల కోట్లు పెట్టుబడులు వచ్చేవి..వచ్చిన పెట్టుబడుతులు కూడ గుజరాత్ పోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానితే కేవలం రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. పాలన పట్టురావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనేమో బీజేపీతో సంబందాలు లేత అభివృద్ది జరగలేదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్…నిజామాబాద్ లో కాంగ్రెస్ పెద్దనేతలే బీజేపీకి సపోర్టు చేసారన్నారు. కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నారని అన్నారు.

Read also: K. Laxman: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత చాలా ఉంది..!

రాష్ట్ర ప్రభుత్వం చారానా పనులకు బారాణా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజాపాలన దరకాస్తుల పరిస్థితి ఏంటీ..ప్రజలు ఆఫీసుల చుట్టు తిరిగి విసిగిపోతున్నారన్నారు. గత వందరోజులు పాలన పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. రైతు బంధు ఊసే లేదు..పెన్షన్లు రావడం లేదన్నారు. జాబ్ కాలెండర్ పై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు యాదాద్రి దేవాలయంలో అవమానం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టికి జరిగిన అవమానం పై స్పందించాలి.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సహచర మంత్రులకు భయపడుతున్నారా..? చేరికలపై గేట్లు తెరువడం కాదు..మేడిగట్టను రిపేర్ చేసి గేట్లు మూసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. సీఎం అజ్ఞాన, అరాచన మాటాలు మానుకోవాలని మండిపడ్డారు. మీరు టార్గెట్ పెట్టుకున్న 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో 13 హామీలు నెరవేర్చాలన్నారు. సీఎం గత పండేంద్ల పాలనలో జరిగిన పనులు ఆపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పాలన సరిగ్గా చేయలేక ఎంపీ ఎన్నికలతో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో వేల కోట్లు పెట్టుబడులు వచ్చేవి..వచ్చిన పెట్టుబడుతులు కూడ గుజరాత్ పోతున్నాయన్నారు. గతంలో నేమో బీజేపీతో సంబందాలు లేక అభివృద్ది జరగలేదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్… నిజామాబాద్ లో కాంగ్రెస్ పెద్దనేతలే బీజేపీకి సపోర్టు చేసారని అన్నారు. కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Amith Shah: బేగంపేట్ ఎయిర్ పోర్టు వద్ద భద్రత… ఎస్ పీజీ కమండోస్ తో అమిత్ షా కాన్వాయ్

Exit mobile version