NTV Telugu Site icon

BRS Public Meeting: రేపు పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ రద్దు.. కారణం ఇదే..

Cm Kcr Brs Sabha

Cm Kcr Brs Sabha

BRS Public Meeting: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిరోజూ మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించడంతో పాటు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు చేరవేస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం కొద్దిరోజులే ఉండటంతో పార్టీ శ్రేణులు అన్నీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇందులోభాగంగా రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారం రోజులు ముందే షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులే ఉండటంతో బీఆర్ఎస్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే నిన్నటి నుంచి నగరంలో వర్షం పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంకా మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రేపు పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ సభ రద్దైంది.

Read also: Karnataka: బ్రాహ్మణ విద్యార్థికి గుడ్డు తినిపించిన విద్యాశాఖ.. విచారణలో తేలిన నిజం

ఎన్నికల ప్రచారానికి వర్షం అడ్డంకిగా మారడంతో పార్టీ శ్రేణుల్లో గుబులు నెలకొంది. ఒక వైపు ప్రచారానికి సమయం కొద్దిరోజులు ఉండటం.. మరోవైపు వర్షం కురుస్తుండటం ప్రచారానికి అంతరాయం కలిగింది. చలితో ప్రజలకు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల్లో నాయకులు ప్రచారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం చూస్తే చలి.. మధ్నాహ్నం చూస్తే వాన జల్లులు దీంతో ప్రచారానికి తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అయితే ప్రచారానికి వాన గండంగా మారిందనే చెప్పాలి. ఇక ఈ కొద్దిరోజుల్లో చలి, వానతో తట్టుకుంటూ ప్రచారం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న సభకు, సమావేశాలకు ప్రజలకు తరలివస్తారా? అనేది పార్టీ శ్రేణుల్లో గుబులు నెలకొంది. దీంతో నాయకులకు వర్షం తలనొప్పిగా మారింది. అయితే బీఆర్ఎస్ సభకు పరేడ్ గ్రౌండ్‌లో సమావేశం నిర్వహించేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మరి వాన వల్ల బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ రద్దవడం.. మరి షెడ్యూల్ లో మార్పు ఏమైన ఉందా? అనే విషయం ఇంకా ఖరారు కాలేదు.
Assam: అస్సాంలో రూ.7.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్