NTV Telugu Site icon

BRS Manifesto Live updates: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. లైవ్ అప్‌డేట్స్

Cm Kcr Brs Manifesto

Cm Kcr Brs Manifesto

BRS Manifesto Live updates:తెలంగాణ భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్‌లోని విజిటర్స్ రిజిస్టర్‌పై సంతకం చేశారు. అంతముకుందులో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌కు ఘనంగా ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు కాసేపట్లో కేసీఆర్ బీ-ఫారాలు అందజేయనున్నారు. అనంతరం అభ్యర్థులతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తారు.

The liveblog has ended.
  • 15 Oct 2023 03:56 PM (IST)

    మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే..

  • 15 Oct 2023 03:37 PM (IST)

    ఈ రోజు బీఫాంలు తీసుకున్న వారు వీరే..

    1.కోనేరు కోనప్ప
    2. దుర్గం చిన్నయ్య
    3.ఎన్.దివాకర్ రావు
    4.కోవా లక్ష్మి
    5. భూక్య జాన్సన్ నాయక్
    6.జోగు రామన్న
    7.అనిల్ జాదవ్
    8.ఇంద్రకరణ్ రెడ్డి
    9. విట్టల్ రెడ్డి
    10. కె.చంద్ర శేఖర్ రావు
    11. షకీల్
    12. హనుమంత్ షిండే
    13. పోచారం శ్రీనివాస్ రెడ్డి
    14. జె.సురేందర్
    15. బి.గణేష్ గుప్తా
    16. బాజిరెడ్డి గోవర్ధన్
    17.వి.ప్రశాంత్ రెడ్డి
    18. పట్నం నరేందర్ రెడ్డి
    19. ఎస్.రాజేందర్ రెడ్డి
    20. డా.సి.లక్ష్మారెడ్డి
    21. ఏ.వెంకటేశ్వర్ రెడ్డి
    22. వి.శ్రీనివాస్ గౌడ్
    23. సీహెచ్‌. రామ్మోహన్ రెడ్డి
    24. ఎస్.నిరంజన్ రెడ్డి
    25. బి.కృష్ణ మోహన్ రెడ్డి
    26. మర్రి జనార్దన్ రెడ్డి
    27. గువ్వల బాలరాజు
    28. జైపాల్ యాదవ్
    29. అంజయ్య యాదవ్
    30. బి.హర్ష వర్ధన్ రెడ్డి
    31.పద్మా దేవేందర్ రెడ్డి
    32.ఎం.భూపాల్ రెడ్డి
    33. చంటి క్రాంతి కిరణ్
    34.జి.మహిపాల్ రెడ్డి
    35. కె.ప్రభాకర్ రెడ్డి
    36. రేగా కాంతా రావు
    37. హరి ప్రియా నాయక్
    38. పువ్వాడ అజయ్ కుమార్
    39. కె.ఉపేందర్ రెడ్డి
    40. ఎల్.కమల్ రాజ్
    41. బానోత్ మదన్ లాల్
    42. వనమా వెంకటేశ్వర్ రావు
    43. ఎస్.వెంకట వీరయ్య
    44. మెచ్చా నాగేశ్వర్ రావు
    45. తెల్లం వెంకట్ రావు
    46. పైళ్ల శేఖర్ రెడ్డి
    47. కేటీ.రామారావు
    48. పల్లా రాజేశ్వర్ రెడ్డి
    49. టి.హరీష్ రావు
    50. ఎ.జీవన్ రెడ్డి
    51. బాల్క సుమన్

  • 15 Oct 2023 03:06 PM (IST)

    బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో 2023

  • 15 Oct 2023 02:42 PM (IST)

    93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా అందిస్తాం - కేసీఆర్

    రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా అందిస్తాం. వ్యవసాయ రంగలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేసీఆర్ బీమా అమలు చేస్తాం. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా కావాలి. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేశాం. తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.

  • 15 Oct 2023 02:41 PM (IST)

    రైతు బంధు పథకాన్ని రూ. 10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతాం - కేసీఆర్

    తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ చేస్తాం. రైతు బంధు పథకాన్ని రూ. 10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతాం. ప్రతి సంవత్సరానికి కొంత పెంచుతూ... ఐదేళ్లకు రూ.16 వేలు చేస్తామన్నారు.

  • 15 Oct 2023 02:41 PM (IST)

    బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం - కేసీఆర్

    ఏడాదికి రూ.500 పెంచుతూ ఐదేళ్లకు రూ.5 వేల పింఛన్ చేస్తాం. వికలాంగుల పింఛన్ ను రూ.6 వేలకు పెంచుతాం. బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం. గిరిజనేతరులకు కూడా పోడు భూములు అందిస్తాం. కులవృత్తుల వారికి ఆర్థిక సాయం అందిస్తాం.

  • 15 Oct 2023 02:31 PM (IST)

    దొడ్డుబియ్యం బాధ ఉండ‌దు - సీఎం కేసీఆర్

    రాష్ట్రంలో ఇంకో స్కీం తేవాల‌ని నిర్ణ‌యించాం. తెలంగాణ‌లో ఆక‌లి పోయింది. హాస్ట‌ల్స్‌లో పిల్ల‌ల‌కు స‌న్న‌బియ్యం, అంగ‌న్‌వాడీలో కూడా అందిస్తున్నాం. అన్న‌పూర్ణ‌గా త‌యారైన రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి కూడా స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. ప్ర‌తి రేష‌న్ కార్డు హోల్డ‌ర్‌కు వ‌చ్చే ఏప్రిల్, మే నుంచి స‌న్న‌బియ్యం ఇస్తాం. ఇక దొడ్డుబియ్యం బాధ ఉండ‌దన్నారు. ఈ స్కీంకు తెలంగాణ అన్న‌పూర్ణ అని పేరు పెడుతున్నాం. ప్ర‌భుత్వంలోకి రాగానే ఇంప్లీమెంట్ చేస్తాం.

  • 15 Oct 2023 02:29 PM (IST)

    93 లక్షల పైచిలుకు రేషన్‌ కార్డులు ఇచ్చాం- సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1.10 లక్షల కుటుంబాలకు 93 లక్షల పైచిలుకు రేషన్‌ కార్డులు ఇచ్చాం. వందకు వంద శాతం ప్రీమియం చెల్లించి రైతుబీమా తరహాలో ఈ కుటుంబాలు అన్నింటికీ కేసీఆర్‌ బీమా- ప్రతి ఇంటికీ ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించాం. ఎల్‌ఐసీ ద్వారానే ఈ బీమా కల్పించనున్నాం. 93 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3600 నుంచి రూ.4వేలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయినా సరే దీన్ని తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి నాలుగైదు నెలల్లో దీన్ని అమలు చేస్తాం. జూన్‌ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

  • 15 Oct 2023 02:28 PM (IST)

    మైనార్టీల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు- సీఎం కేసీఆర్

    తెలంగాణలో ఒకప్పుడు కరువు ఉండేదని, ఎన్నికల ప్రణాళికలో లేని చాలా పథకాలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో కరెంట్‌ కూడా ఉండేది కాదన్నారు. 10 ఏళ్లలో చిన్న గొడవ కూడా జరగలేదన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.

  • 15 Oct 2023 02:23 PM (IST)

    ఎన్నికల ప్రణాళికలో లేని చాలా పథకాలను అమలు చేశాం - సీఎం కేసీఆర్

    ఎన్నికల ప్రణాళికలో లేని చాలా పథకాలను అమలు చేశామని అన్నారు. గిరిజనేతరులకు పోడుపట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ మతసామరస్యం ఉందన్నారు. దళిత సమాజం బాగుపడే వరకూ దళితబంధు అమలు చేస్తామన్నారు. తెలంగాణలో మతకల్లోలాలు లేవన్నారు. ప్రజలు అవసరాలకు అనుగుణంగా పథకాలు వున్నాయని అన్నారు. పోడు భూముల గొడవల్లో కేసులు ఎత్తివేశామన్నారు.

    మైనార్టీ బడ్జెట్‌ పెంపు
    దళిత బంధును కొనసాగిస్తాం
    మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట, బడ్జెట్‌ పెంపు
    మైనార్టీల జూ.కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు అప్‌గ్రేడ్‌
    రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని నిర్ణయం
    రేషన్‌ కార్డు దారులకు సన్న బియ్యం
    నెలకు పింఛన్‌ రూ. 5 లకు పెంపు
    ప్రజలందరికి రూ.5లక్షల కేసీఆర్‌ బీమా
    కేసీఆర్‌ బీమా పేరుతో కొత్త స్కీమ్‌

  • 15 Oct 2023 02:22 PM (IST)

    జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

    జనగామ అభ్యర్థిగా కేసీఆర్‌ చేతుల మీదుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఫామ్‌ అందుకున్నారు.

  • 15 Oct 2023 01:58 PM (IST)

    మిత‌గా వారికి రేపు బీ-ఫారాలు అందిస్తాం - సీఎం కేసీఆర్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోయే బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు. ఒక్కో అభ్య‌ర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. మిత‌గా వారికి రేపు బీ-ఫారాలు అందిస్తామ‌న్నారు.

  • 15 Oct 2023 01:55 PM (IST)

    అభ్యర్థులకు బీఫామ్‌తో పాటు ఒక్కొక్కరికి రూ.40 లక్షలు - కేసీఆర్‌

    బీఫామ్‌ అందుకున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, హన్మంత్‌ షిండే, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, రాజేంద‌ర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ల‌క్ష్మా రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, అంజ‌య్య యాద‌వ్, లింగాల క‌మ‌ల్ రాజ్‌కు బీఫామ్‌ లు సీఎం కేసీఆర్ అందజేశారు. అభ్యర్థులకు బీఫామ్‌తో పాటు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కును కేసీఆర్‌ అందజేశారు.

  • 15 Oct 2023 01:54 PM (IST)

    బీ ఫామ్‌ అందుకున్న వారు వీరే..

    బీఫామ్‌ అందుకున్న ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగు రామన్న, జాన్సన్‌ నాయక్‌; అనిల్‌ జాదవ్‌, విఠల్‌ రెడ్డి, షకీల్‌, బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, జాజాల సురేందర్‌,కృష్ణమోహన్‌ రెడ్డి, మర్రి జనార్దన్‌ రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్‌, బీరం హర్షవర్దన్‌ రెడ్డి, పద్మా దేవేందర్‌ రెడ్డి, భూపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్‌, బీఫామ్‌ అందుకున్న గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్‌, పువ్వాడ అజయ్‌, మదన్‌లాల్‌, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావులకు బీఫామ్‌ సీఎం కేసీఆర్ అందజేశారు.

  • 15 Oct 2023 01:52 PM (IST)

    కవిత, గంప గోవర్ధన్‌కు బీఫామ్‌లు అందజేసిన సీఎం కేసీఆర్

    సీఎం కేసీఆర్‌ తరఫున కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన బీఫామ్‌ను గంప గోవర్దన్‌ అందుకున్నారు. అలాగే మాతృవియోగం కారణంగా కార్యక్రమానికి దూరంగా ఉన్న వేముల ప్రశాంత్‌రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కవిత బీఫామ్‌ తీసుకున్నారు.

  • 15 Oct 2023 12:56 PM (IST)

    గెల‌వ‌లేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు - సీఎం కేసీఆర్

    శ్రీనివాస్ గౌడ్, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, కృష్ణ‌ మోహ‌న్ రెడ్డి మీద కేసులు పెట్టారు. గెల‌వ‌లేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. సాంకేతికంగా కార‌ణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. మ‌న‌కు మంచి న్యాయకోవిదులు ఉన్నారు. మీకు గైడ్ చేయ‌డానికి న్యాయ‌వాదులు అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి, తెలియ‌ని విష‌యాలు తెలుసుకోవాలన్నారు.

  • 15 Oct 2023 12:51 PM (IST)

    98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటారు

    98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటారు. మ‌న పార్టీకి, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు మ‌ధ్య వార‌ధిగా భ‌ర‌త్ కుమార్ ప‌ని చేస్తున్నారు.అభ్య‌ర్థుల‌కు సందేహాలు వ‌స్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే ప‌రిష్కారం చూపిస్తారు. పొర‌పాటు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. ఇప్ప‌ట్నుంచే నామినేష‌న్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. చివ‌రి రోజున నామినేష‌న్లు వేసేందుకు ప్ర‌య‌త్నించొద్దు.

  • 15 Oct 2023 12:46 PM (IST)

    ఇది ఇంపార్టెంట్ ఘ‌ట్టం - సీఎం కేసీఆర్

    ఇది ఇంపార్టెంట్ ఘ‌ట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక మ‌నిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయ‌కుడికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉండాలి. నాయ‌కుల‌ చిలిపి ప‌నులు, చిల్ల‌ర ప‌నుల వ‌ల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కార‌వంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్ర‌వ‌ర్తించ‌డం నేర్చుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌తంగా మ‌న‌వి చేస్తున్నానని అన్నారు.

  • 15 Oct 2023 12:45 PM (IST)

    ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వ‌డ‌మే ఫైన‌ల్ కాలేదు - సీఎం కేసీఆర్

    ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వ‌డ‌మే ఫైన‌ల్ కాలేదు. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పాం. మార్చుకున్న చోట విచిత్ర‌మైన సంద‌ర్భాలు ఉన్నాయి. వేముల‌వాడ‌లో మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయి కాబ‌ట్టే అక్క‌డ అభ్య‌ర్థిని మార్చుకోవాల్సి వ‌చ్చింది అని కేసీఆర్ తెలిపారు.

  • 15 Oct 2023 12:45 PM (IST)

    మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టికెట్లు వ‌స్తాయి- సీఎం కేసీఆర్

    మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టికెట్లు వ‌స్తాయి, విజ‌యం సాధిస్తార‌ని ఆత్మ‌విశ్వాసం ప్ర‌క‌టించానని అన్నారు. ఈ రోజు రెండు కార్య‌క్ర‌మాలు ఉన్నాయి. హుస్నాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. స‌మ‌యానికి అన్ని జ‌రిగిపోయేలా ముగించుకుందాం. మీ అంద‌రికీ చాలా సంద‌ర్భాల్లో, చాలా స‌మావేశాల్లో పదే ప‌దే ఒక మాట చెప్పానని అన్నారు.

  • 15 Oct 2023 12:42 PM (IST)

    సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు -కేసీఆర్

    సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలని సూచించారు. ప్రతీది తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దని సీఎం కేసీఆర్ అభ్యర్థులకు తెలిపారు.

  • 15 Oct 2023 12:40 PM (IST)

    న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో సీటు మార్పు- సీఎం కేసీఆర్

    న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో సీటు మార్పు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. మళ్లీ విజయం మనదే ఎవరూ తొందరపడొద్దని అన్నారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు చేశామన్నారు.

  • 15 Oct 2023 12:38 PM (IST)

    ప్రస్తుతం 51 బీఫామ్‌ లు.. మిగతా బీఫామ్‌ లు రెడీ అవుతున్నాయి- కేసీఆర్

    బీఫామ్‌ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం 51 బీఫామ్‌ లు రెడీ అయ్యాయని కేసీఆర్‌ అన్నారు. మిగతా బీఫామ్‌ లు రెడీ అవుతున్నాయి. మిగతా అందరికీ రెండు రోజుల్లో బీఫామ్‌ లు అందుతాయి.

  • 15 Oct 2023 12:37 PM (IST)

    సమస్య ఏమైనా ఉంటే 9848023175 నెంబర్‌ కు కాల్‌ చేయండి- కేసీఆర్

    సమస్య ఏమైనా ఉంటే 9848023175 నెంబర్‌ కు కాల్‌ చేయాలని కేసీఆర్‌ సూచించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. మిగతా బీఫామ్‌ లు రెడీ అవుతున్నాయని అన్నారు. మిగతా అందరికీ రెండు రోజుల్లో బీఫామ్‌ లు అందుతాయన్నారు.

  • 15 Oct 2023 12:35 PM (IST)

    ప్రస్తుతం 51 బీఫామ్‌ లు రెడీ అయ్యాయి - సీఎం కేసీఆర్

    ప్రస్తుతం 51 బీఫామ్‌ లు రెడీ అయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. బీఫామ్‌ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు చేసుకోవాలని సూచించారు. భరత్‌ కుమార్‌ ఎన్నికల కో ఆర్డినేటర్‌ గా వ్యవహరిస్తారని అన్నారు.

  • 15 Oct 2023 12:33 PM (IST)

    అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ - కేసీఆర్‌

    అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. సమస్య ఏమైనా ఉంటే 9848023175 నెంబర్‌ కు కాల్‌ చేయాలని కేసీఆర్‌ సూచించారు.

  • 15 Oct 2023 12:31 PM (IST)

    జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు- కేసీఆర్

    తెలంగాణ భ‌వ‌న్‌లోని జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి సీఎం కేసీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అంత‌కుముందు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

  • 15 Oct 2023 12:30 PM (IST)

    తెలంగాణ భ‌వ‌న్‌కు సీఎం కేసీఆర్

    ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్నారు. సీఎంకు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేప‌ట్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ బీ-ఫారాలు అంద‌జేయ‌నున్నారు. అనంత‌రం అభ్య‌ర్థుల‌తో క‌లిసి కేసీఆర్ భోజ‌నం చేయ‌నున్నారు. అనంత‌రం మీడియా స‌మావేశం నిర్వ‌హించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్ర‌క‌టించ‌నున్నారు కేసీఆర్.