NTV Telugu Site icon

PM Modi Tour: వరంగల్‌లో మోడీ పర్యటన.. బహిష్కరించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

Pm Modi Warangal Tour

Pm Modi Warangal Tour

BRS Leaders Banned PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోడీ రేపు (08-07-23) వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్త చేశారు. అటు.. బీజేపీ రాష్ట్ర నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు, గందరగోళ వాతావరణ పరిస్థితులు చోటు చేసుకోకుండా.. భారీస్థాయిలో పోలీసుల్ని మోహరిస్తున్నారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న ప్రయాణికుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ సభ సందర్భంగా మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. అంతేకాదు.. మోడీ సభా ఏర్పాట్లనూ పరిశీలిస్తున్నారు.

Ponnam Prabhakar: బీజేపీ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకునేందుకే మోడీ పర్యటన

అయితే.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని కారణంగానే.. తాము మోడీ పర్యటనకు దూరంగా ఉంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణపై వివక్షత చూపుతున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు బహిష్కరణతో తమ నిరసన తెలియజేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ.. ఈ సభలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ప్రకటిస్తారని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ మోడీ ఇవి ప్రకటించకపోతే.. తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హెచ్చరించారు. మోడీ వరంగల్ టూర్ చూడ్డానికి అధికారిక కార్యక్రమంలాగా కాకుండా.. పార్టీ కార్యక్రమంలాగా ఉందని విమర్శించారు.

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ-బోరుసు లాంటివి.. నీతివంతమైన పాలన తెస్తాం

Show comments