NTV Telugu Site icon

BRS First Public Meeting Live: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

Khammam Brs Metting

Khammam Brs Metting

బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ రంగులోకి మారింది. అయితే సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల బీఆర్‌ఎస్‌ జెండాలు, హోర్డింగ్‌లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి తరలివస్తున్నారు.

The liveblog has ended.
  • 18 Jan 2023 05:29 PM (IST)

    కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారు: కేసీఆర్

    రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్లను ఎన్‌పీఏల పేరుతో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. దేశంలో అనేక దుర్మార్గాలకు కాంగ్రెస్, బీజేపీ కారణమన్నారు. బీఆర్ఎస్ లాంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ తయారయ్యేదని కేసీఆర్ అన్నారు.

  • 18 Jan 2023 05:26 PM (IST)

    ప్రజల కష్టాలను తీర్చడానికే బీఆర్ఎస్ పుట్టింది: కేసీఆర్

    ఖమ్మంలో బీఆర్ఎస్ సభ దేశంలో ప్రబలమైన మార్పునకు సంకేతం అని సీఎం కేసీఆర్ అన్నారు. లక్షల కోట్ల ఆస్తి మన దేశ ప్రజల సొత్తు అని.. కానీ ఇంకా యాచకులుగానే మిగిలిపోయామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అద్భుతమైన పంటలు పండే అవకాశం ఉన్నా ఆహార ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ప్రజల కష్టాలను తీర్చడానికే బీఆర్ఎస్ పుట్టిందన్నారు.

  • 18 Jan 2023 04:55 PM (IST)

    కేసీఆర్ మాకు పెద్దన్న: కేజ్రీవాల్

    కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతం అని.. కంటి వెలుగు కార్యక్రమం నుంచే తాము చాలా నేర్చుకున్నామని ప్రశంసించారు. ఢిల్లీ వెళ్లాక ఈ కార్యక్రమాన్ని తాము కూడా అమలు చేస్తామన్నారు. పంజాబ్‌లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడతామని కేజ్రీవాల్ చెప్పారు.

  • 18 Jan 2023 04:39 PM (IST)

    దేశమనే పుష్పగుచ్ఛంలో అన్ని పూలు ఉండాలి

    దేశమనే పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ అన్నారు. కానీ కొందరు ఒకే రంగు పువ్వును కోరుకుంటున్నారని.. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని భగవంత్‌మాన్ విమర్శలు చేశారు.

  • 18 Jan 2023 04:37 PM (IST)

    దళిత బంధు, రైతు బంధు అమలవుతున్న ఏకైక రాష్ట్రం

    దేశంలో దళిత బంధు, రైతు బంధు అమలవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. సాగు, తాగునీటికి కొరత లేని రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని డి.రాజా ఆరోపించారు.

  • 18 Jan 2023 04:14 PM (IST)

    కేంద్రానికి ఇంకా 399 రోజులే ఉన్నాయి: అఖిలేష్

    ఇవాళ్టితో కేంద్రానికి ఇంకా 399 రోజులే ఉన్నాయి.. రైతులను ఆదుకుంటామన్న బీజేపీ సర్కారు మాట తప్పింది.. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చేతులెత్తేశారు.. తెలంగాణలో బీజేపీ ప్రక్షాళన జరుగుతున్నట్లే యూపీలోనూ జరుగుతుందని అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • 18 Jan 2023 03:54 PM (IST)

    ఈ సభ దేశానికి ఒక దిక్సూచి: విజయన్

    బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన కేసీఆర్‌కు కేరళ సీఎం విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభ దేశానికి ఒక దిక్సూచి అని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలన్నారు.

  • 18 Jan 2023 03:41 PM (IST)

    ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లైవ్

  • 18 Jan 2023 03:37 PM (IST)

    సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం

    ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

  • 18 Jan 2023 02:34 PM (IST)

    జాతీయ నేతలకు భట్టి విక్రమార్కను పరిచయం చేసిన కేసీఆర్‌

    కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కేసీఆర్‌ జాతీయ నేతలకు పరిచయం చేశారు. భట్టిని భుజం పై చేయి వేసి నవ్వుతూ మాట్లాడారు. కంటి వెళుగు కార్యక్రమం అనంతరం జాతీయ నేతలతో లబ్దిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఖమ్మం భారీ బహిరంగ సభకు నేతలందరు కలిసి రావడం.. అందులో భట్టి విక్రమార్క కూడా ఉండటం సంచనంగా మారింది.

  • 18 Jan 2023 02:24 PM (IST)

    లబ్దిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేసిన జాతీయ నేతలు

    ఖమ్మంలో రెండో కంటి వెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేశారు. జాతీయ నేతలు ఒక్కొక్కరుగా కళ్లజోళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 18 Jan 2023 02:22 PM (IST)

    రెండో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

    రెండో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ తో సహా.. జాతీయ నేతలు ఒక్కొక్కరుగా కళ్లజోళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

  • 18 Jan 2023 02:02 PM (IST)

    4 రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం

    కేసీఆర్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, విజయన్‌ 4 రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం.

  • 18 Jan 2023 01:52 PM (IST)

    రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

    ఖమ్మం నలుగురు సీఎంలు చేరుకున్న ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి. ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు కేసీఆర్‌. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు.

  • 18 Jan 2023 01:49 PM (IST)

    ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్ ను కేసీఆర్ శుభాకాంక్షలు

    ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రారంభం అనతరం ఖమ్మం కలెక్టర్ వి.పి గౌతమ్ ను కలెక్టరేట్ కార్యాలయంలో తన కుర్చీలో కూర్చోబెట్టి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇతర కలెక్టరేట్లని కేవలం కేసీఆర్ ప్రారంభిస్తే.. ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభం మాత్రం నలుగురు ముఖ్యమంత్రులు పాల్గొనడం ఈ కలెక్టరేట్ ప్రత్యేకత.

  • 18 Jan 2023 01:48 PM (IST)

    ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ ను ప్రారంభించిన కేసీఆర్‌

    ఖమ్మం చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్‌. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు.

  • 18 Jan 2023 01:37 PM (IST)

    ఖమ్మం చేరుకున్న సీఎం కేసీఆర్, జాతీయ నేతలు

    సీఎం కేసీఆర్‌, జాతీయ నేతలు ఖమ్మం చేరుకున్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిచనున్నారు కేసీఆర్‌. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్‌. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు.

  • 18 Jan 2023 01:32 PM (IST)

    యాదాద్రిని దర్శించుకున్న జాతీయ నాయకులు

    యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సందర్శించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రిని దర్శించుకున్న తరించిపోయారు. అనంతరం కృష్ణా శిలల్లో నిర్మించిన ఆలయాన్ని ఆసాంతం ఆసక్తిగా పరిశీలించారు. ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి సంకల్ప శక్తిని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొనియాడారు. ఆలయ ఆధునీకరణ ప్రక్రియ, ఆలయ విశిష్టతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. అనంతరం ఖమ్మం సభకు పయనమయ్యారు.

Show comments