Site icon NTV Telugu

Revanth Reddy Corona: మూడోసారి కరోనా బారిన రేవంత్‌ రెడ్డి..!

Revanh Reddy Corona

Revanh Reddy Corona

Revanh Reddy Corona: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయనకు గతంలో రెండు సార్లు కరోనా బారిన పడిన టీపీసీసీ చీఫ్‌ కు మరో కోవిడ్‌ సోకింది. అయితే న‌ల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పాద‌యాత్రని చేప‌ట్టింది. నారాయ‌ణ‌పూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగ‌నున్న ఈ పాద‌యాత్ర వాస్తవానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రారంభంకావాల్సింది. దీంతో.. ఈ మేర‌కు ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవగా.. రేవంత్ రెడ్డి కూడా ఈ యాత్రకు పార్టీ నేత‌ల‌ను ఆహ్వానిస్తూ తాను కూడా సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. ఇలాంటి కీల‌క త‌రుణంలో రేవంత్ రెడ్డి క‌రోనా బారిన ప‌డటం సంళనంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డిలో స్వల్పంగా క‌రోనా ల‌క్షణాలు క‌నిపించాయి. ఈనేపథ్యంలో.. త‌న ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆయన తాను యాత్రకు రాలేన‌ని.. దానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ పార్టీ నేత‌లు, శ్రేణుల‌కు మెసేజ్ ఇచ్చారు.

read also: Genco CMD Prabhakar Rao: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు

మార్చి 3, 2021 లో కూడా.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. తనకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్యుల సూచ‌న మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నానని తెలిపారు.

జనవరి 3, 2022లో రేవంత్​ రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో.. జ్వరం, సల్ప కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. అయితే.. రేవంత్​ రెడ్డికి కరోనా సోకడం అప్పటికే రెండో సారి కావడం గమనార్హం. ఇక మళ్లీ మూడో సారి రేవంత్‌ రెడ్డికి కోవిడ్‌ లక్షణాలు వున్నాయని పార్టీ శ్రేణులకు మెసేజ్‌ చేయడంతో.. పార్టీ శ్రేణులు అందరు రేవంత్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Bandi Sanjay: పోస్టర్లు వేయడం మొదలుపెడితే.. టీఆర్ఎస్ కాంగ్రెస్ లు తట్టుకోలేవు

Exit mobile version