NTV Telugu Site icon

Bhatti Vikramarka: భట్టి పీపుల్స్‌ మార్చ్‌ కు నేడు విరామం.. కారణం ఇదే..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: కొమురం భీం జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర కు నేడు విరామం ఇచ్చారు. అయితే ఇవాళ ఉగాది పండుగ జరుపుకునేందుకు ఆయన పీపుల్స్‌ మార్చ్‌కు కాస్త విరామం ఇచ్చారు. పండుగను ఆదివాసీల మధ్య కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోనున్నారు. ఝరి లో ఉన్న ఆలయాన్ని భట్టి విక్రమార్క వెళ్లి మొక్కుకున్నారు. ఈరోజు ఝరిలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రజలందరికి శోభకృత్ నామ సంవత్సరంలో శుభాలు కాంక్షలు తెలిపారు. అందరూ ఆనందంగా ఉగాది పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా.. రేపు యధావిధిగానే భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

నిన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర 6 వ రోజున చేరిన సందర్భంగా.. ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొననున్నారు. కొమురం భీం జిల్లా జామ్నే నుంచి కెరమెరి ఘాట్ రోడ్ మీదుగా కెరమెరి మండల కేంద్రము వరకు పీపుల్స్ మార్చ్ సాగింది. జామ్నే గ్రామం నుంచి 8 కిలోమీటర్ల తరువాత ఘాట్ రోడ్డు పక్కన లంచ్ బ్రేక్ కాగా.. కెరిమెరి లో రాత్రి కి కార్నర్ మీటింగ్ కెరిమెరి గ్రామంలోనే రాత్రికి బస చేశారు భట్టి. ఆరవ రోజు సుమారు 15 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. ఇవాల పండుగ రోజు కావడంతో యాత్రకు బ్రేక్‌ ఇచ్చారు.
Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. పక్కా పాన్ ఇండియా లెవల్