NTV Telugu Site icon

Brahmotsavam in Karimnagar: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన కరీంనగర్‌.. వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు

Brahmotsavam In Karimnagar

Brahmotsavam In Karimnagar

Brahmotsavam in Karimnagar: బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు కరీంనగర్ ముస్తాబైంది.. శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామివారి ఆలయంతోపాటు ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారుల వెంబడి భారీ కటౌట్లను ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి పొద్దుపోయాక కరీంనగర్ తన మెరిసే విద్యుత్ దీపాలతో సరికొత్త శోభను సంతరించుకుని నగరవాసులను అలరిస్తోంది.

Read also: Flexis War BRS: అధికార పార్టీలో వర్గ విభేదాలు.. ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ రగడ

ప్రధానంగా ప్రధాన నహదారుల పక్కన ఏర్పాటు చేసిన కటౌట్లు కరీంనగర్‌ వాసులను అలరిస్తున్నాయి. బస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఐలాండ్‌ లో వెలిగే విద్యుత్‌ దీపాలు మనస్సును ఆహ్లాదపరుస్తాయి. మనశ్శాంతిని కలిగిస్తాయి. బస్‌స్టేషన్‌ నుండి పోలీసు కమీషనర్‌ ఆఫీస్‌ మీదుగా గోపురం మాదిరి కటౌట్‌ నుండి లోపలకు వెళ్ళే రహదారికి ఇరుపక్కల వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంబాలు మనస్సును పులకింపజేస్తాయి. ఇక.. అక్కడి నుండి కుడివైపు తిరిగితే… ఇరు ప్రక్కల విద్యుత్ కాంతులతో తణుకులీనే స్థంబాలతో పాటు వాటి ఆవల దేదిప్యమానంగా వెలిగిపోయే స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. కాగా.. తెలంగాణ చౌక్ ఐలాండ్ లో స్వామి వారి భారీ కటౌట్ దర్శనమిచ్చి భక్తులను అలౌకిక ఆనందానికి గురిచేస్తుంది… తెలంగాణ చౌక్ నుండి కమాన్ వరకు ఏర్పాటు చేసిన లైటింగ్ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక మరో వైపు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ కటౌట్లతో అందంగా తీర్చిదిద్దారు.

Read also: Astrology : జనవరి 23, సోమవారం దినఫలాలు

అంతేకాకుండా..దేవతా మూర్తుల కటౌట్ల కింది నుండి లోపలికి వెళ్తే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టెంట్లు దర్శనమిస్తాయి. వాటినుంచి లోపలికి వెళ్తే బ్రహ్మోత్సవాలకు సిద్దమైన స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఇక ఆలయంలో యజ్ఞం కోసం నాలుగు దిక్కులు, నాలుగు ద్వారాల మధ్య ఏర్పాటు చేసిన యజ్ఞగుండం దర్శమిస్తుంది. బయట తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విశాలమైన వేదిక కనిపిస్తుంది. అంతే కాకుండా బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యలు కనిపిస్తాయి.
IT Layoffs: ఐటీ ఉద్యోగులపై పిడుగు.. రోజుకు 3000 మంది ఉద్యోగాలు ఊస్ట్