NTV Telugu Site icon

Yadagirigutta: గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న బాలుడి తల.. తరువాత ఏం జరిగిందంటే..

Yadagirifutta

Yadagirifutta

Yadagirigutta: పిల్లలు ఉన్నకాడ ఉండనే ఉండరని తల్లిదండ్రులు అంటుంటారు. అవును, పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పిల్లలు సైలెంట్‌గా పనిలో వున్నారు కదా అని కాస్త పక్కకు వచ్చామో అంతే సంగతులు. వారు ఆడుకోవడం అటు వుంచితే.. ప్రాణం మీదకు తెచ్చుకుని తల్లిదండ్రులకు నానా తంటాలు పెడుతుంటారు. తాజాగా ఓ బాలుడి చేసిన పనికి తల్లిదండ్రులే కాదు క్యూలైన్‌లో నిలబడి దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు సైతం భయాందోళనకు గురయ్యారు.

Read also: మైగ్రేన్‌ తలనొప్పితో బాధ పడుతున్నారా? ఇలా ట్రై చేయండి

హైదరాబాద్ లోని బోడుప్పల్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం నిన్న రాత్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శీఘ్ర దర్శనం కోసం పయనం అయ్యారు. అక్కడకు చేరుకుని స్వామి వారి దర్శనం కోసం క్యూలైల్ లో వేచివున్నారు. ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం ప్రత్యేక క్యూ లైన్ లో వేచి ఉన్న సమయంలో బాలుడు పక్కనే వున్న రెండు గ్రిల్స్‌ మధ్య తల పెట్టాడు. అంతే ఎంతకూ తల బయటకు రాకపోవడంతో బాలుడు కేకలు వేశాడు. గుర్తించిన తల్లి దండ్రులు బాలుడి తలను గ్రిల్స్‌ నుంచి బయటకు తీయడానికి నానా తంటాలు పడ్డారు. అయితే అక్కడే వున్న కొందరు అయ్యప్ప మాల ధరించిన స్వాములు బాలుడి తలను చాకచక్యంగా బయటకు తీశారు. బాలుడికి గాయాలు ఏమీ కాకపోవడంతో తల్లిదండ్రులు, దర్శనానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు.
Bhatti Vikramarka: నేడు బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం..

Show comments