Site icon NTV Telugu

Extra Marital affair: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్ హోల్ లో దాచిన ప్రియుడు

Extra Marital Affair

Extra Marital Affair

Extra Marital affair: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ లో దారుణ హత్య కలకలం రేపుతుంది. ప్రియురాలిని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని మ్యాన్‌ హోల్‌ లో పడేసిన చేతులు దులుపుకున్నాడు. ఏమీ ఎరుగనట్లు ప్రియురాలి మిస్సింగ్‌ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

శంషాబాద్‌ లో పరిసరాల్లో వెంకట సాయి సూర్యకృష్ణ ఓ ఆలయంలో పూజారి. ఇతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనకు అప్సర అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబందానికి దారితీసింది. అయితే అప్సర తనను పెళ్లి చేసుకోవాలని వెంకట సాయి సూర్యకృష్ణ ఓత్తిడి చేయడంతో విసుగు చెందిన వెంకట సాయి సూర్యకృష్ణ ఆమెను ఎలాగైనా వదులించుకోవాలని ప్లాన్‌ వేశాడు. చివరకు అప్సరను చంపేందుకు ఓప్లాన్‌ వేశాడు. ఆమెను కలవాలని నమ్మించి శంషాబాద్‌లోని నర్కూడ వద్దకు తీసుకుని వెళ్లాడు. ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది.

దీంతో ఇదే అలుసుగా భావించిన వెంకట సాయి సూర్యకృష్ణ, అప్సరపై బండరాయితో మోది అతికిరాతకంగా హత్య చేశాడు. దీంతో అప్సర అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. దీంతో అప్సర మృతదేహాన్ని తనతో పాటు తెచ్చుకున్న కవర్‌లో మృతదేహాన్ని కట్టి కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. దానిపై మట్టితో కప్పేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు వచ్చి అప్సర కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అప్సరకు తనే బస్సు ఎక్కించానని ఆతరువాత కనిపించకుండా పోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అసలు కిలాడి వెంకట సాయి సూర్యకృష్ణ అనే తేల్చారు. వెంకట సాయి సూర్యకృష్ణను అదుపులో తీసుకుని ప్రశ్నించగా కథంగా వివరించడంతో మ్యాన్‌ హోల్‌ మిస్టరీ కాస్త వీడింది. తనను పెళ్లి చేసుకోవాలని మాటి మాటి అప్సర బ్లాక్‌ మెయిల్‌ చేయడంతోనే ఆమెను హత్య చేశానని పోలీసుల ముందు వెంకట సాయి సూర్యకృష్ణ అంగీకరించాడు.
Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె

Exit mobile version