Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- మాజీ హవల్దార్‌కు కీపర్ల సహకారం
- లక్షల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు
- ఇద్దరు కీపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మల్లేశ్‌తో సీన్ రీ-కన్స్ట్రక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో జరిగిన సంచలనాత్మక ఆయుధాల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు విచారణలో కీలక పురోగతి లభించగా, ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ మల్లేశ్‌కు ఆర్మీ ఆయుధాగారం (ఆర్మరీ) కీపర్లు పూర్తిస్థాయిలో సహకరించినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిర్ధారించారు. ఈ నేరంలో భాగస్వామ్యమున్న ఆయుధాగారం కీపర్లు వినోద్, శేషులను పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.
కీపర్లతో మల్లేశ్ కుమ్మక్కు.. రూ. లక్షల్లో ఆర్థిక లావాదేవీలు
మిలిటరీ క్యాంపులోని ఆయుధాగారం నుంచి తుపాకులు, బుల్లెట్లను దొంగిలించే క్రమంలో మల్లేశ్‌తో కలిసి వినోద్, శేషులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఈ చోరీకి సంబంధించి మాజీ హవల్దార్ మల్లేశ్ , ఈ ఇద్దరు కీపర్ల మధ్య భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సాంకేతిక ఆధారాలను (టెక్నికల్ ఎవిడెన్స్) అధికారులు సేకరించారు. ఆయుధాలు చోరీ చేసి బయటకు తరలించినందుకు గానూ వారికి మల్లేశ్ భారీగా నగదు ముట్టజెప్పినట్లు భావిస్తున్నారు.
Also Read
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
10 రోజుల పోలీస్ కస్టడీ.. మద్రాస్ రెజిమెంట్‌లో సీన్ రీ-కన్స్ట్రక్షన్
ఇప్పటికే మల్లేశ్ నివాసంలో సోదాలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన అనేక ఆర్మీ ఆయుధాలను, భారీగా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 10 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న మల్లేశ్‌ను పోలీసులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా చోరీ ఎలా జరిగింది, ఆయుధాలను ఏ విధంగా బయటకు తెచ్చారనే అంశాలను ప్రత్యక్షంగా నిర్ధారించుకోవడానికి మల్లేశ్‌ను బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌కు తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించారు. కేసు విచారణ పురోగతిలో ఉండటంతో ఈ ఆయుధాల చోరీకి సంబంధించిన మరిన్ని సంచలన వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!