తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, ఇప్పుడు మరో కొత్త సమస్య రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తుంది. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ఆర్మూర్ డివిజన్‌లో 8 మందికి ఈ వ్యాది నిర్ధారణ జరిగింది. నవీపేటలో 24 గంటల వ్వవధిలో బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ వ్యాది జిల్లాలో రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
నిజామాబాద్ జిల్లా పై బ్లాక్ ఫంగస్ పంజా…
