NTV Telugu Site icon

తెలంగాణ‌లో మ‌రో జిల్లాలో బ్లాక్ ఫంగ‌స్ క‌ల‌క‌లం

Black Fungus

దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు వెలుగు చూస్తుండ‌గా.. తెలంగాణ‌లోనూ బ్లాక్ ఫంగ‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తూనే ఉంది.. ఇప్ప‌టికే ఆదిలాబాద్ జిల్లాలో క‌ల‌వ‌ర‌పెట్టి… ఖ‌మ్మంలోనూ వెలుగు చూసింది బ్లాక్ ఫంగ‌స్.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.. చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య కి బ్లాక్ ఫంగస్ ను గుర్తించారు వైద్యులు.. 20 రోజుల క్రితం కరోనాబారిన‌ప‌డిన ఆయ‌న‌.. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. గ‌త‌ 10 రోజుల నుండి ఇంటి దగ్గర ఉంటున్నారు.. అయితే, రెండు రోజులుగా మొఖం, మెడలు ఉబ్బడంతో మ‌ళ్లీ కరీంనగర్ ఆస‌త్పికి తరలించారు కుటుంబ సభ్యులు.. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు.. బ్లాక్ ఫంగస్ గా గుర్తించి హైదరాబాద్ కు త‌ర‌లించారు. ఇలా.. రోజు రోజుకూ బ్లాక్ ఫంగ‌స్ బారిన‌ప‌డే బాధితులు తెలంగాణ‌లో పెరిగిపోవ‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తుండ‌గా.. అప్ర‌మ‌త్త‌మైన రాష్ట్ర ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌ల‌కు పూనుకున్న సంగ‌తి తెలిసిందే.