Site icon NTV Telugu

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్సెన్షన్‌ వేటు.. త్వరలో క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ

Mla Raja Singh

Mla Raja Singh

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే తమ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయనపై సస్పెన్షన్‌ ఉపసంహరణ ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సస్పెన్షన్‌ ఉపసంహరణ సభలో తాను కూడా పాల్గొంటానని, ఈ విషయమై అన్ని విధాలుగా ఆలోచించి హైకమాండ్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.

గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది. రాజా సింగ్‌ను ఎందుకు బహిష్కరించకూడదో వివరించాలని బీజేపీ కోరింది. నగరంలోని ప్రముఖ హాస్యనటుడు మునవర్ ఫరూఖీ షో సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రవక్త ముహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజాసింగ్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేశారు.

ఇక తాజాగా తెలంగాణ బీజేపీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే రాజా సింగ్ బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల వస్తున్న వదంతులపై రాజాసింగ్‌ క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నుండే గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నా మెంటాలిటీ కి బీజేపీ తప్ప ఏ పార్టీ లు షూట్ కావు… ఎవరు తీసుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్ళలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు నా వెనుక ఉన్నారని రాజాసింగ్‌ తెలిపారు.
WhatsApp Chat Lock: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌.. ఇక మరింత భద్రత..

Exit mobile version