NTV Telugu Site icon

Bandi sanjay: మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తున్నారు

Bandi Sanjay Nalgonda

Bandi Sanjay Nalgonda

Bandi sanjay: కవిత మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గములో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. బీజేపీ ముఖ్యమంత్రి ముందుగా అభ్యర్థిని ప్రకటించదన్నారు. కొంత మంది కావాలని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తా అనే అధికారం నాకు లేదని బండి సంజయ్‌ తెలిపారు. మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సిబిఐ వాళ్ళు విచారణ చేస్తున్నారని తెలిపారు. సింహల ఫొటోలు చూసి ఇంట్లోకి పోవాలా వద్దా అని భయపడుతున్నారని ఎద్దేవ చేశారు బండిసంజయ్‌. ప్రత్యేక కమిటీ, పార్లమెంట్ పార్టీ బోర్డు మాత్రమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు.

Read also: Pawan Kalyan : ఉస్తాద్ భగత్‌సింగ్‌ ముహుర్తం ఫోటోలు

కొంతమంది తన పేరు రాస్తున్నారని.. అలా చేయవద్దని అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకునే అధికారం కూడా తనకు లేదని బండి చెప్పారు. అసలు తాను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందని బండి సంజయ్ తెలిపారు. షర్మిల తామ పార్టీ మనిషంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎక్కడైనా సింగిల్‌గా పోటీ చేస్తుందన్నారు. తన పాదయాత్రకు వేలాది మంది స్వచ్ఛందంగా వస్తున్నారని బండి తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 15న ప్రజా సంగ్రామ యాత్ర కరీంగనార్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో ముగుస్తుందని చెప్పారు. చివరి సమావేశానికి జేపీ నడ్డా వస్తారని… ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని బండి సంజయ్ అన్నారు.
Himachal Pradesh: హిమాచల్‌ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సుఖు ప్రమాణం