NTV Telugu Site icon

BJP Vijaya Rama Rao: క్లౌడ్ బరస్ట్ కాదు కాబోయేది ఫ్యామిలీ బరస్ట్

Vijayarama

Vijayarama

తెలంగాణలో రాబోయే రోజుల్లో జరగబోయే కీలక పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అని అశాస్త్రీయంగా మాట్లాడారని మండిపడ్డారు బీజేపీ నేత, మాజీ మంత్రి విజయరామారావు. జరిగింది క్లౌడ్ బరస్ట్ కాదు కేసీఆర్ మైండ్, ఆయన కుటుంబం బరస్ట్ కాబోతోంది.సర్వే ఫలితాలు చూసి ఆయనకు ఇలాంటి క్లౌడ్ బరస్ట్ విషయాలు గుర్తొస్తున్నాయి.పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో.. అనే భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. డబ్బుల కోసం కాళేశ్వరాన్ని కూడా కొల్లగొట్టారు. ఈ విషయం ఎవరికీ అర్థం కాదని కేసీఆర్ భావిస్తున్నాడన్నారు.

అధికార బలం, అయనకున్న వాక్చాతుర్యంతో ఇన్ని రోజులు నెట్టుకుంటు వచ్చారు. 2 వేల కోట్లు ఖర్చు పెట్టి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టాలని చూస్తే తన కుటుంబానికి ఏమాత్రం లబ్ధి చేకూరదు అని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును కడితే ఫలితం తక్కువ ఖర్చు ఎక్కువ అని చెప్పినా కేసీఆర్ వినలేదు. సాధ్యాసాధ్యాలు, ఆర్థిక పరమైన అంశాలను పట్టించుకోకుండా తనకు తానే పెద్ద ఇంజినీర్ అని చెప్పుకున్నాడు. ప్రాణహిత బ్యాక్ వాటర్ ఫ్లో వస్తే ఎంతమేర ఇబ్బందులు ఎదురావుతాయనే అంశంపై సర్వే చేయకుండా కేసీఆర్ అడ్డుకున్నారు.

Allu Arjun: బాలీవుడ్ ఎంట్రీపై బన్నీ షాకింగ్ కామెంట్స్.. అక్కడ కంఫర్ట్ ఉండదు

బాహుబలి మోటార్లు BHEL వాళ్ళు చెయ్యలేరని విదేశాల నుంచి తెప్పించారు. ఆ మోటార్లు ఒండ్రు మట్టిలో మునిగిపోయాయి. అవి రిపేర్ అవుతాయో లేదో కూడా తెలియదు. దీనివల్ల 15 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు విజయరామారావు. కేసీఆర్ ది క్షమించరాని నేరం. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్స్ అంతా రిటైర్డ్ వాళ్లే. వాళ్ళను కాంట్రాక్టు పద్ధతిన కొనసాగిస్తుండటంతో వాళ్ళు నోరు మెదపలేదు. గజ్వేల్ కు ఒక ఎకరాకు నీళ్లు రావాలంటే రూ.50 వేల ఖర్చు వచ్చింది. కేసీఆర్ పొలానికి మాత్రమే ఈ నీళ్లు వెళ్లాయి. 3 ఏండ్లలో ఇతరులకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు.

ఆయన ఒక్కడి పొలం కోసం లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్లు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అభూత కల్పన. కమీషన్లు, డబ్బుల కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనులు చేస్తోంది. గజ్వేల్ నుంచి బస్వాపూర్ వరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల కోసం నదీ జలాలను తరలించారు. తెలంగాణ ద్రోహులు అని కేసీఆర్ అందరినీ విమర్శిస్తారు.. కానీ అసలు ద్రోహి కేసీఆర్. ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విజయరామారావు.

కరకట్టలు కట్టకపోవడం వలన పొలాలు మునిగిపోయాయని, బాహుబలి మోటార్ల రిపేర్ కు 600 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయినా అవి పని చేస్తాయో లేదో తెలియని పరిస్థితి. గతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే నీళ్లు రాలేదు.. అలాంటిది విదేశీయులు కోట్లు ఖర్చు పెట్టి క్లౌడ్ బరస్ట్ చేశారా? కేసీఆర్ ముందస్తుకు పోడు.. పోతే రాష్ట్రపతి పాలన విధిస్తారు. అందుకే సీఎం రాజీనామా చేస్తే మంచిదన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్. నిన్న కేసీఆర్ నెత్తిపై పిట్టలదొర టోపీ ఉంది.. కానీ చేతిలో కర్ర తుపాకీ ఒక్కటే తక్కువ అయింది. గతంలో తెలంగాణను మోసం చేస్తే రాళ్లతో కొట్టాలని అన్నారు.. కేసీఆర్ విషయంలో ఆ సమయం ఆసన్నమైంది. ప్రజలు ఆయన్ను ఎక్కడికి వస్తే అక్కడి నుంచి రాళ్లతో కొట్టి తరమాలన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్.

NTV Exclusive Interview: టీ హబ్ సీఈవో శ్రీనివాసరావు మహంకాళితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ