Site icon NTV Telugu

NVSS Prabhakar: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎంను కాపాడ‌లేవ్‌

Prabhakar

Prabhakar

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌విఎస్ఎస్‌ ప్రభాకర్ తెలంగాణ పోలీసు వ్యవస్థపై, సీఎం కేసీఆర్ పై సంచళన వ్యాఖ్యలు చేశారు. ఎక్క‌డ ఉగ్ర‌వాద చ‌ర్య‌లు జ‌రిగినా.. మూలాలు మాత్రం తెలంగాణ‌లో..కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఉగ్రవాద ఏమూల జరుగుతున్నా.. దాని మూలాలు మాత్రం తెలంగాణలో ఎందుకు ఉంటున్నాయో.. దీనికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు.

ఎన్నో కేసులతో సంబందం ఉన్న MIM నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ప్రభుత్వం, పోలీసులే అని ఆరోపించారు. MIM నేతలను కాపాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ తెలీనట్లు నటిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా టిఆర్ఎస్ ఆగడాలను గమనిస్తోందని అన్నారు. త్వరలో ప్రజలే టిఆర్ఎస్ బుద్దిచెప్పే రోజులు వస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mim తో TRS మైత్రి తెలంగాణకు చాలా ప్రమాదకరంగా మారిందని మండిప‌డ్డారు. మే 14 సరికొత్త మార్పునకు పునాది కాబోతుందని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి అమిత్ షా వస్తున్నారని గుర్తు చేశారు. ఈసభలో కెసిఆర్ ను.. రైతు, యువజన, దళిత, బలహీన వర్గాల, తెలంగాణ ద్రోహిగా నిలబెట్ట బోతున్నామ‌న్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు.. కేసీఆర్ ను కాపాడలేవని ఎద్దేవ చేశారు. మధ్యంతరానికి అయిన, ముందస్తుకు అయిన మేము సిద్దంగా వున్నామ‌ని సవాల్ విశిరారు.

Jammu Kashmir: ఇండియా-పాక్ సరిహద్దులను జల్లెడపడుతున్న భద్రతాబలగాలు

Exit mobile version