K. Laxman: ఈరోజు, రేపు బీజేపీ సంపర్క్ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి మోడీ మూడో సారి దేశానికి ప్రధానిగా అవసరమని వివరించే కార్యక్రమం చేపట్టామని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముషీరాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సంకల్ప పత్రాన్ని విడుదల చేశారని గుర్తు చేశారు. అది దేశ భవిష్యత్తు కోసం, 140 కోట్ల దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సంకల్ప పత్రం అని తెలిపారు. కేవలం ఓట్ల కోసం మేనిఫెస్టో ప్రకటించడం, గ్యారెంటీల పేరుతో ప్రజలను అభ్యపెట్టారని మండిపడ్డారు. 2047 వరకు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే పత్రమే ఈ సంకల్ప పత్రం అన్నారు. పది సంవత్సరాల మోడీ పాలనలో ఐదవ అతి పెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్ధాడని అన్నారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నరేంద్ర మోడీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
Read also: Kishan Reddy: తెలంగాణ రైతు పేరుతో కిషన్ రెడ్డి రైతు దీక్ష..
పేదల పథకాల్లో దళారీ వ్యవస్థ లేకుండా 34 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేశాడన్నారు. మరొక సారి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలిపారు. అవినీతి నల్లధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఉమ్మడి పౌరసత్వం (యూనిఫాం సివిల్ కోడ్) తీసుకురబోతున్నారని అన్నారు. తెలంగాణాలో అత్యధిక మెజారిటీతో బీజేపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ రోజు, రేపు బీజేపీ సంపర్క్ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి మోడీ మూడో సారి దేశానికి ప్రధానిగా అవసరమని వివరించే కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగానే నాతో కలిసి ముషీరాబాద్ అశోక్ నగర్ లో నాయకులు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Read also: Nagarjuna: కొత్త దర్శకులతో నాగార్జున!
మోడీ ప్రజాకర్షణ తట్టుకోలేక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. అవినీతి బయట పెట్టకుండా టీవీ సీరియల్ లా కాలయాపన చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మీడియాలో ప్రచారం కోసం కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నాడు తప్పా అసలైన దోషులను ఎవరినీ అరెస్ట్ చేయడం లేదన్నారు. ప్రజలు ఈ రెండు పార్టీల వైనాన్ని గమనించి వచ్చే మే 13 ఎన్నికల్లో వారి మోసాన్ని భగ్నం చేయాలన్నారు. నరేంద్ర మోడీ ని ప్రధాని చేసేందుకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే అది మురిగిపోతుందన్నారు. కాంగ్రెస్ ను ఎదురుకునే సామర్థ్యం కేవలం బీజేపీ కె ఉందన్నారు. తెలంగాణ లో భవిష్యత్తు బీజేపీ దే అని గమనించి ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ కి ఓటు వేయమని కోరుతున్నా అన్నారు.
War2 : ఎన్టీఆర్ కోసం ఆ బ్యూటీని దింపారా.. ఇది కదా కిక్కు..