బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు రెండో రోజు హెచ్‌ఐసీసీలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లడుతూ ప్రధాని మోడీ ముగింపు ప్రసంగంపై వివరించారు. బీజేపీ రెవల్యూషన్ పై మాట్లాడారని, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందించాలని వివరించారన్నారు. నిరంకుశ, నియంత్రుత్వ పాలన నుంచి హైదరాబాద్ కు విముక్తి కలిగించిన వ్యక్తి సర్దార్ పటేల్ అని, హైదరాబాద్ సర్దార్ పటేల్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చారన్నారు. సర్దార్ పటేల్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేశామనని, మా ప్రభుత్వం ఇప్పటి వరకున్న ప్రధానుల గురించి ఒక మ్యూజియంను ఏర్పాటుచేశామన్నారు. పార్టీలకతీతంగా ఈ పనులన్నీ చేశామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పాలనపై మాకున్న డెడికేషన వల్ల ఇది సాధ్యమని ఆయన తెలిపారు.
ప్రధాని రెండు మాటలు క్లియర్ గా ప్రస్తావించారని, పార్టీ నేతలు ప్రొ పీపుల్.. ప్రొ.. గుడ్ గవర్నెన్స్(ప్రొ పీ టు ప్రొ జీ) గా ఉండాలని సూచించారన్నారు. దేశ భవిష్యత్ పై మోడీ విజన్ తో ఉన్నారని ఆయన వెల్లడించారు. కొవిడ్ సమయంలో దేశ ప్రజలంతా ఎన్నో చాలెంజ్ లు ఎదుర్కొన్నారు. ఆయన విజన్ తో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించారన్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఆర్థికంగా చితికిపోయిందని, అయినా ఇతర దేశాలతో పోలిస్తే దేశం పరిస్థితి చాలా ఉన్నతస్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ దిగుమతులు కూడా అద్భుతంగా జరిగాయి. ఇవన్నీ మోడీ విజన్ వల్లే..అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర పార్టీల నేతలు తమను తాము రాజులుగా భావిస్తున్నారు.. అందుకే ఇన్నేండ్లు వెనుకబడిపోయిందని, కానీ మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. రెండ్రోజుల క్రితం నేను వచ్చాను.. వరంగల్ లో బస చేశానన్నారు. అక్కడి ప్రజలు, మేధావులు, వ్యాపారులు, నిరుపేదలు, రైతులు, యువకులను కలిశానని, పార్టీకి సంబంధించి పలు మోర్చాల పనితీరును పర్యవేక్షించానన్నారు.
వరంగల్ లోని ప్రాంతాలను చూసి నా జన్మ ధన్యమైందని, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, కట్టడాలు అద్భుతమని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతాన్ని సందర్శించాలని, ఆ ప్రాంత అద్భుతాలను అందరూ చూడాలన్నారు. గతంలో లద్ధాఖ్ కు వెళ్లాలంటే చైనా వాళ్లు ఎప్పుడేం చేస్తారోనని బార్డర్ లో భయంభయంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఆయన తెలిపారరు. సేవ, సమన్వాయం, సమన్వయం, సంవాద్ తో ముందడుగు వేస్తామని, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల ఎందరో మంది మహిళలు కష్టాల కడలి నుంచి బయటపడ్డారని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా అవ్వబోతున్నారని మోడీ ప్రసంగంలో వివరించారన్నారు. ఒక దళితుడికి, ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ, హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా పలికితే తప్పేంటి? గతంలో అదే పేరుండేది కదా..? ఇదొక్కటే కాదు.. చాలా రాష్ట్రాలకు గతంలో ఒక పేరుంటే.. ఇప్పుడో పేరుతో పిలవడంలేదా?
