Site icon NTV Telugu

KTR is Angry: ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు? లక్ష్మణ్ పై కేటీఆర్ ఫైర్..

Ktr, Dr K Laxman

Ktr, Dr K Laxman

ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయితే.. కేంద్ర పథకాలను టీఆర్ఎస్ అమలు చేస్తూ సొమ్ము ఒకరిది, సోకు టీఆర్ఎస్ ది అంటూ బీజేపీ నేత లక్ష్మణ్ ఇటీవల చేసిన కామెంట్లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు Dr.లక్ష్మణ్ గారు? అంటూ కౌంటర్ విసిరారు. తెలంగాణ రాష్ణ్ర సొమ్ముతో మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నదన్న మంత్రి కేటీఆర్, తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పడుతున్నందుకు థాంక్స్ చెప్పండి అంటూ సలహా ఇచ్చారు. లెక్కలు తెలుసుకొమ్మని, ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

అయితే.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకా లతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో పరిస్థితి సొమ్ము కేంద్రానిదని, సోకు టీఆర్ఎస్ఏ అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ యువమోర్చ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన నారాయ ణపేట జిల్లా దామరగిద్దలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. అంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత బియ్యంతో కేంద్ర ప్రభుత్వ దేశంలోని 80 కోట్ల మందికి ఆపన్న హస్తం అం దిస్తుందన్నారు. ఇక కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పేర్లు మారుస్తూ తామే అమలు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల, ఫసల్ బీమా యోజన, గ్రామాలకు రహదా రులు, పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు అందిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తామే చేపడుతున్నామంటూ గొప్పలు చెప్పు కొంటుందని ఎద్దేవా చేశారు. దీంతో.. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మని డా.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
Vishnuvardhan Reddy: సంచలన ఆరోపణ… వైసీపీ మిత్రపక్షాలుగా PFI, SDPI

Exit mobile version