NTV Telugu Site icon

K Laxman: యువత బతుకుల్ని తెలంగాణ ప్రభుత్వం ఆగం చేసింది

Laxman On Paper Leak

Laxman On Paper Leak

BJP MP K Laxman Fires On BRS Govt Over TSPSC Paper Leak: తెలంగాణ యువత బతుకుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసిందని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని పేర్కొన్నారు. ఈ లీకుల్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువతల అశలపై నీళ్ళు పోశారని మండిపడ్డారు. సిట్ విచారణపై తమకు నమ్మకం కుదరడం లేదని, అనేక కేసుల్లో సిట్‌ల విచారణ వేగవంతంగా జరగలేదని అన్నారు. నయీమ్ కేసు నుంచి మొన్నటి డ్రగ్స్ కేసు వరకు.. సిట్ విచారణలేమీ తేలలేదన్నారు. అవినీతి కేసుల్ని మూసివేసే దాంట్లో రాష్ట్ర ఏసీబీకి దేశంలోనే గొప్ప పేరుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని చెప్పారు.

Talasani Srinivas Yadav: మేము కమిట్మెంట్‌తో పని చేస్తుంటే.. బీజేపీ కుట్రలు చేస్తుంది

గతంలో కూడా ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 26 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్యమాలకు వేదికగా మారబోతుందన్నారు. లిక్కర్ కేసులో నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారని.. విచారణ ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పించుకునే మార్గాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారే తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారన్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈడీ విచారణను ఎదుర్కున్నారన్నారు. ఇక బీజేపీలో అందరూ ఐక్యంగానే ఉన్నామని, అసమ్మతి లేదని ఎంపీ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో కీలక మలుపు