కాంగ్రెస్‌తో దోస్తీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దస్తీ వేసిండు అని.. పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్… నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ముందుగా కేసీఆర్ బూతులు లేకుండా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు.. అరిగి పోయిన రికార్డు లాగా కొత్త విద్యుత్ బిల్లు గురించి మళ్లీ మళ్లీ అవే అబద్దాలు ఆడుతున్నారని విమర్శించిన ఆయన.. విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో మూడవ పేజీ క్లాజ్ 4.7లో క్లియర్‌గా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టనవసరం లేదని రాసిఉందని తెలిపారు.. రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీలు ఆపమని ఎక్కడా కేంద్రం చెప్పలేదని.. రైతులకు, రజకులకు, నాయిబ్రాహ్మణులకు, గిరిజనులకు, దళితులకు ఎవరికైతే సబ్సిడీలు ఇస్తున్నరో అవన్నీ ఇవాల్సిందేనన్నారు.. బిల్లులో ఎక్కడ కూడా రాష్ట్రంలోని జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆపి ప్రైవేట్ సంస్థల దగ్గర విద్యుత్తు కొనమని చెప్పలేదు. పైగా రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ వాడుకొని విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలనే ఉందని.. ఆ టెక్నాలజీ కూడా కేంద్రమే దిగుమతి చేసుకొని రాష్ట్రాలకు ఇస్తుందని తెలిపారు.
Read Also: Talasani: కేసీఆర్ వ్యాఖ్యలతో ఆర్మీకి సంబంధం ఏంటి..? జీవితకాలం ఇదేనా..?
ఇక, కుల అహంకారంతో రాజ్యాంగ నిర్మాత మీద వాఖ్యలు చేస్తున్నారు అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఇప్పుడు రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు.. దళితుల కోసం రాజ్యాంగం మార్చాలంటున్న కేసీఆర్ కేబినెట్‌లో ఎంత మంది దళితులు ఉన్నారు అని నిలదీశారు.. నరేంద్ర మోడీ కేబినెట్‌లో 12 మంది దళితులు, 8 మంది గిరిజనులు, 26 శాతం ఎస్సీ, ఎస్టీ, దళితులు ఉన్నారని తెలిపారు. ఇక, కాంగ్రెస్‌తో దోస్తీ కోసం కేసీఆర్ దస్తీ వేసిండు.. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని బుట్టలో వేసిండు… రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని సూచించారు బీజేపీ ఎంపీ.. మరోవైపు, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రజలకు సమాచారం ఇచ్చింది భారతసైన్య ఉన్నతాధికారులని… రాజకీయనాయకులు కాదన్న ఆయన.. రుజువులు చూపించమని సైన్యాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు.. చైనా బోర్డర్ విషయంలో కూడా ఇలాగే మాట్లాడారని.. భారత సైన్యాన్ని హేళన చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.. రాజకీయాలల్లోకి సైన్యాన్ని తీసుకురావద్దని విజ్ఞప్తి చేసిన ఎంపీ అర్వింద్.. ప్రధాని మోడీ తన నాయకత్వంలో ఈ దేశ సైన్యాన్ని బలోపేతం చేస్తున్నారని.. సైన్యం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. పైగా మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ సామాగ్రిని దేశంలోనే తయారు చేసుకోగలుగుతున్నాం అన్నారు.
