NTV Telugu Site icon

Dalitha Bandhu: ‘దళితబంధు’కి కౌంటర్‌గా బీజేపీ దళితాతిథ్యం?

Dalitha Bandhu Bjp

Dalitha Bandhu Bjp

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకానికి పొలిటికల్‌గా కౌంటర్‌ ప్రోగ్రామ్‌ని బీజేపీ ప్రారంభించిందా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే కమలదళం తెలంగాణలో దళితాతిథ్యం అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు దళితుల ఇళ్లకు అతిథులుగా వెళ్లి వాళ్ల ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆయా కుటుంబాలతో కలిసి భోజనాలు చేస్తున్నారు. వాళ్ల కష్టసుఖాలను, బాధలను, సంతోషాలను అడిగి తెలుసుకుంటున్నారు. మీకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. తద్వారా దళితులను బీజేపీకి దగ్గర చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

వాళ్లను పార్టీకి ఓటు బ్యాంకుగా మలచుకునే ప్రణాళికను ఆచరణలో పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయటానికి ఈవిధంగా కూడా రంగంలోకి దిగారు. ఈ మేరకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ మొన్న శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా జైనాద్‌ మండల కేంద్రంలోని మహరాజుల కాలనీలో ఉన్న అల్లంకొండ ఉషన్న అనే దళితుడి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులూ ఉన్నారు. అనంతరం అక్కడి పురాతన సూర్యనారాయణ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కిసాన్‌ మోర్చా నేతలతో సమావేశం నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ పేరుతో కోట్ల రూపాయలను అనుత్పాదక పథకాలకు ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎలక్షన్స్‌ జరగొచ్చని, దీనికి పార్టీ శ్రేణులు, నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే దళితులకు చేరువయ్యేందుకు బీజేపీ ఈ కార్యక్రామాన్ని ‘జన్‌ సంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా చేపట్టింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాన్ని పార్టీ శ్రేణులు, నాయకులు తమ ఇళ్లల్లో పెట్టుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌ ఇటీవలే పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా బీజేపీ ప్రారంభించిన ఈ ‘దళితాతిథ్యం’ తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న దళితబంధుకి కౌంటర్‌ కాదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఈ పథకాన్ని దుబ్బాక ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని తెర మీదికి తెచ్చింది. కానీ ఆశించిన ప్రయోజనాన్ని పొందలేకపోయింది. ఆ బైఎలక్షన్‌లో గులాబీ పార్టీ అభ్యర్థి గెలవలేదు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందరే నెగ్గాడు. అయినా ఆ స్కీమ్‌ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులను గుర్తించే ప్రక్రియ నడుస్తోంది.

అసలే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేనందున దళితబంధు అర్హులందరికీ డబ్బులు ఇస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దుబ్బాక ఫలితాన్నిబట్టి ఈ ఒక్క పథకమే టీఆర్‌ఎస్‌ని మళ్లీ గెలిపిస్తుందనే గ్యారెంటీ సైతం లేదు. కాబట్టి దళితబంధును చూసి కాషాయ శిబిరం కలవరపాటుకు గురికావాల్సిన అవసరంలేదు. కాకపోతే రాజకీయ పార్టీ అన్నాక, అందునా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి తామే బలమైన ప్రత్యర్థి అని చెప్పుకుంటున్నందున బీజేపీ ఈ దళితాతిథ్యానికి రూపకల్ప చేసినట్లు అర్థంచేసుకోవచ్చి రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.

Show comments