Raja Singh: ఆరు గ్యారెంటిలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…? అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అక్బరుద్దిన్ ముందు ప్రమాణం చేయమని చెప్పాము.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు అంత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేసామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందని కీలక వ్యాక్యలు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని తెలిపారు. ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తోంది ? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటిలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…? అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై మా యుద్ధం మొదలైందన్నారు.
Read also: Triptii Dimri : యానిమల్ మూవీ లో హాట్ బ్యూటీ తృప్తి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చారన్నారు. దాన్ని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ చేస్తామని చెప్పారని తెలిపారు. రైతు బంధు హామీ ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. పాత రైతు బంధునే ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోందన్నారు. రైతు బంధు ఐదెకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వరనే సమాచారం మాకు అందుతుంద అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా ఈ అంశాన్ని పేర్కొనలేదన్నారు. ఇక రెండు లక్షల ఋణమాఫీ ఎప్పటి వరకు చేస్తారో స్పష్టం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామన్నారు.
Hombale: సలార్ మేనియాలో భగీర ప్రమోషన్స్…