NTV Telugu Site icon

హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కి అడ్డాగా మారింది : బీజేపీ ఎమ్మెల్యే

హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కి అడ్డాగా మారింది.. బాంబుల ఫ్యాక్టరీ గా తయారయింది అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. కానీ డీజీపీ, కమిషనర్ లు ఆ విషయం పట్టించుకోకుండా గో రక్షకులను అరెస్ట్ చేయాలని అదేశిస్తున్నారు అని పేర్కొన్నారు. మీరు గో రక్షకులను అరెస్ట్ చేయాలి అంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి. బక్రీద్ కి ఆవులను, ఎద్దులను కోయండని డీజీపీ కమిషనరే చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఇంకా మేము బతికే ఉన్నాము అని తెలిపారు. అయితే బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మూలాలు హైదరాబాద్ లో బయటపడిన విషయం తెలిసిందే.