Site icon NTV Telugu

మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం శూన్యం : రాజా సింగ్

కేటీఆర్ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం శూన్యం అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. కేటీఆర్ నాలాలు ఆక్రమణ తొలగింపులు చేయాలని అంటుంటే ఆశ్చర్యమేస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా ఒక్క నాలా ఆక్రమణను తొలగించలేదు అన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న మీ ఎంఐఎం తమ్ముళ్లు భారీగా నాలాలు ఆక్రమణలు చేస్తున్నారు అని చెప్పారు. ఓల్డ్ సిటీ లో నాలాలు చెరువులు కబ్జాకు గురైనవి అన్నారు. అందుకే ఒక్క వర్షం వస్తే ఓల్డ్ సిటీ మునిగి పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఓల్డ్ సిటీ పై ముందుగా దృష్టిపెట్టి నాలాల ఆక్రమణ తొలగించాలి అని డిమాండ్ చేసారు ఎమ్మెల్యే రాజా సింగ్.

Exit mobile version