టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గొప్ప విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. బీజేపీ కి ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ అలాగే ప్రతీకార రాజకీయాలు ఇవన్నీ ఈ ఎన్నికల్లో ఓడిపోయాయి అని పేర్కొన్నారు. ఈ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. అయితే హోరా హోరీగా జరిగిన హుజురాబాద్ ఎన్నికలో ఈరోజు ఈటల రాజేందర్ 23 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు.
ప్రతీకార రాజకీయాలు ఈ ఎన్నికల్లో ఓడిపోయాయి : రాజా సింగ్
