Site icon NTV Telugu

తెలంగాణ రావడానికి బీజేపీ కూడా కారణం…

హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదు అని బాల్క సుమన్ అన్నాడు. ఒక్క డబల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల న ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమా అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈటల రాజేందర్ సీఎం కి లేఖ రాసాడని ఫేక్ లెటర్ సృష్టించారు. గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వలేదని బాల్క సుమన్ ఒప్పుకున్నాడు.. బాల్క సుమన్ బానిస సుమన్.. ఆ కుటుంబానికి బానిస అని తెలిపారు. నువ్వొక్కడివే ఉద్యమం చేయలేదు… తెలంగాణ రావడానికి బీజేపీ కూడా కారణం అని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ అభివృద్ధి మీద,ఆత్మ గౌరవం మీద చర్చకు సిద్ధం. ఆంధ్ర నుండి వచ్చిన వారి కాళ్లకు ముళ్ళు కుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నాడు. రోజా గారి ఇంటికి వెళ్ళింది ఎవరు , భోజనము చేసింది ఎవరు. రాయల సీమ ను రతనాల సీమ చేస్తా అన్నది ఎవరు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుంది ఏంది అని అడిగారు. లంకలో పుట్టినోళ్లు అందరూ రాక్షసులే అన్నాడు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు లేవు.. ఆంధ్రోళ్ల ఓట్లు అవసరం లేదు. మరో సారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని స్పష్టం చేసారు.

Exit mobile version