కరీంనగర్ జిల్లా అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు. అక్కడ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ… ఈటలకు ఈ ఎన్నికలో భారీ మెజారిటీ రావాలి. ఏ సర్వే చూసినా… ఈటలదే విజయం అని పేర్కొన్నారు. ఓడిపోతారు అని ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం వల్లనే కేసీఆర్ హుజూరాబాద్ మీటింగ్ కు రావడం లేదు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27కి పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నించిన ఆయన… మేము బిజీ ఉన్నాము అని నటిస్తున్నారు. మీ నటన ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ నేల మీదకు వస్తారు అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.
అందుకే కేసీఆర్ హుజూరాబాద్ కు రావడం లేదు : రఘునందన్ రావు

raghunandan-rao