NTV Telugu Site icon

కేసీఆర్‌, హరీష్‌పై రాములమ్మ ఫైర్‌.. దళిత ద్రోహి, దళిత ద్వేషి..!

Vijayashanthi

Vijayashanthi

హుజురాబాద్‌ అసెంబ్లీ బై ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావును టార్గెట్‌ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి.. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని, కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గు చేటు అంటూ ఫైర్‌ అయిన రాములమ్మ… హరీష్ రావు దళిత బంధు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ఇక, దళిత ద్రోహి కేసీఆర్ గారికి, దళిత ద్వేషి హరీష్ రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సందర్భం ఇది అంటూ పిలుపునిచ్చారు. ఈ హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుంచి వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామం అంటూ జోస్యం చెప్పారు రాములమ్మ.