MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని చాలా బాగా పని చేస్తున్నారని, ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. గోషామహల్ లోని ముర్లిధర బాగ్ లో నిర్మించిన 120 డబల్ బెడ్ రూం ఇళ్లను మంత్రులు తలసాని, మహమూద్ అలీ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరయ్యారు. వేదిక పై తలసాని, మహమూద్ అలీతో పాటు రాజా సింగ్ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకునే నాయకులు ఇలా ఒకే వేదికపై ఉండటం షాక్ కి గురిచేసింది. ముగ్గురు కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి లబ్దిదారులకు అందించారు.
Read also: Free Broadband: ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో BSNL బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్.. త్వరపడండి
మొన్నటి వరకు తలసానిపై విమర్శలు చేసిన రాజాసింగ్ వేదకపై తలసానిని, బీఆర్‌ఎస్ పనితీరుపై పొగడ్తలతో ముంచెత్తారు. 2017 లో ఇక్కడ చాలా ఘోరంగా పరిస్థితి ఉండేదని అన్నారు. కొంత లేట్ అయినా ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయని రాజాసింగ్ అన్నారు. మంత్రి తలసాని చాలా బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో అందరికీ ఇండ్లు ఉండాలి అంటున్నారని తెలిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన , తెలంగాణ ప్రభుత్వం కలిపి ఇక్కడ ఇండ్లు నిర్మించారని పేర్కొన్నారు. పక్కనే మరికొంత మంది ఇండ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్ళు ఇవ్వాలని రాజాసింగ్ కోరారు.
Youtuber : తెలివి తెల్లారినట్టే ఉంది.. వ్యూస్, లైక్స్ కోసం విమానాన్నే కూల్చేశాడు
తాజాగా హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొత్త సచివాలయంలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. రాజాసింగ్‌ను కొత్త సచివాలయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం గేటు వద్ద లోనికి వెళ్లకుండా రాజాసింగ్‌ను అడ్డుకున్నారు. అయితే ఈ పరిణామాలపై రాజాసింగ్ సీరియస్‌గా స్పందించారు. సమావేశం ఏర్పాటు చేశామని.. నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చానని భద్రతా సిబ్బంది అడ్డగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారని మండిపడ్డారు. టైంపాస్ కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీటింగ్ పెట్టారా? అని ప్రశ్నించారు. రాజాసింగ్ చాలా సేపు గేటు బయటే వెయిట్ చేసి వెనుదిరిగి వెళ్లిపోయారు. మొన్నటి వరకు తలసానిపై మండిపడ్డ రాజాసింగ్ ఇవాల ఆయన్నే ప్రశంసించడంపై ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతారు అనే వార్తలు కూడా నిజమవుతాయా? అనే రీతిలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే రాజాసింగ్ కూడా దీనిపై స్పందించి బీజేపీలోనే కొనసాగుతా అంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Top Headlines @1PM: టాప్ న్యూస్