Site icon NTV Telugu

K. Laxman: టాం అండ్ జెర్రీ ఫైట్ లా ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహారం..!

K.lakshaman

K.lakshaman

K. Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలి టాం అండ్ జెర్రీ ఫైట్ లా కనిపిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు చివరిలో కలిసిపోతాయన్నారు. ఈ రెండు పార్టీ లు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి వస్తున్న అంశాలు దిగ్భ్రాంతి నీ కలిగిస్తున్నాయన్నారు. అసలు దోషులను కాపాడే ప్రయత్నం రేవంత్ సర్కారు చేస్తుందన్నారు. మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తుందన్నారు. దేశభద్రత, వ్యక్తి గత భద్రత కు భంగం కలిగించేలా పోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందన్నారు.

Read also: Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!

రియల్ ఎస్టేట్, నగల వ్యాపారులను దోచుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో అధికార పార్టీకి పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించారని తెలిపారు. రేవంత్ రెడ్డి కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సూత్ర దారుల పై చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రోజు అధికారం లో ఉన్న పెద్దల ఆదేశం మేరకే ట్యాప్ చేశామని చెబుతున్న ఎందుకు రేవంత్ రెడ్డీ చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. గవర్నర్ నీ కలుస్తాం… కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ జరిపించాలని కోరుతామన్నారు. జుగుప్సాకరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయన్నారు. ఒక్క రూపాయి అయిన పెట్రోల్ డీజిల్ ధరలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించిందా…. చర్చకు సిద్దమన్నారు.

Read also: Production No2: హీరోయిన్ గా దృశ్యం పాప రెండో సినిమా.. ఏకంగా ప్రొడ్యూసర్ కొడుకుతో..!

ట్విట్టర్ టిల్లు మొసలి కన్నీరు ను ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. కవితను అరెస్ట్ చేయక పోతే బీజేపీ BRS ఒకటే అని ప్రచారం చేశారన్నారు. ఈ రోజు విచారణ సంస్థలు కవితను అరెస్ట్ చేశాయన్నారు. ఎన్ని విన్యాసాలు చేసిన బీజేపీ తెలంగాణ లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పగలరా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని? సవాల్ చేస్తున్న అన్నారు. జై శ్రీరామ్ అంటే కేటీఆర్ కు కడుపు మంట ఎందుకు…. ఎవరి మనోభావాలు వారివి అంటూ మండిపడ్డారు. మోడీ అభివృద్ది ఎజెండా తీసుకునే ఈ ఎన్నికల్లో కి వెళ్తున్నామన్నారు.
Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!

Exit mobile version