NTV Telugu Site icon

నేడు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్న ఈటల…

ఈటల రాజేందర్ ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. అయితే ఈటల రాజీనామాతో హుజురాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ పైన వరుస విమర్శలు చేస్తున్నారు ఈటల. అధికార తెరాస అహంకారానికి హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఇక ప్రగతి భావం లో ఇచ్చిన స్రిప్ట్ చదివే మంత్రులు తమ ఇంట్లో ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలన్నారు. అయితే ఈటల పై తెరాస నాయకులూ కూడా విమర్శల వర్షం గుపిస్తున్నారు. కానీ హుజురాబాద్ లో రానున్న ఉప ఎన్నికల కోసం ఆయన ఈరోజునుండే ఇంటింటి ప్రచారాన్ని మొదలై పెడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.