Site icon NTV Telugu

Amit Shah: నేడు బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం.. హాజరు కానున్న అమిత్ షా

Amith Shah

Amith Shah

Amit Shah: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.

Read also: CM Jagan: నేడు విజయవాడకు సీఎం.. పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న జగన్..!

ఫిబ్రవరి 20 నుంచి విజయ సంకల్ప రథ యాత్ర ప్రారంభం కాగా.. బాసర సరస్వతీ అమ్మవారి ఆశీస్సులతో కొమరంభీం యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది 22 అసెంబ్లీలను కవర్ చేస్తుంది. భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రారంభమైంది. భువనగిరి, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ కవర్ చేస్తూ యాత్ర కొనసాగింది. మక్తల్‌లోని కృష్ణా గ్రామం నుంచి కృష్ణా విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ మీదుగా యాత్ర కొనసాగింది. కొమరం భీమ్ యాత్రను అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ ప్రారంభించారు. తాండూరులో రాజరాజేశ్వరి యాత్ర ప్రారంభమైంది. కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, భాగ్యలక్ష్మి యాత్రకు గోవా సీఎం ప్రమోద సావంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణా యాత్రకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపా హాజరయ్యారు. ఈ యాత్రలో మరిన్ని రోడ్ షోలు ఉంటాయని, ఐదు యాత్రల్లో 5500 కి.మీ మేర యాత్ర సాగడమే కాకుండా 114 సభలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగింది. 106 రోడ్ షోలు నిర్వహించారు. ఇవాళ జరిగే సమావేశానికి అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం అమిత్ రాష్ట్రానికి రానున్నారు.
SBI : సుప్రీంకోర్టు తీర్పుతో ఆరుగంటల్లో రూ.13,075కోట్లు నష్టపోయిన ఎస్బీఐ ఇన్వెస్టర్లు

Exit mobile version