Site icon NTV Telugu

హుజూరాబాద్ లో దళితుల ఓట్లు కోసమే కేసీఆర్ జిమ్మిక్కులు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే కేసీఆర్ ను దళితులు విశ్వసిస్తారన్న ఎ.చంద్రశేఖర్… రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏడేళ్ళ తర్వాత సీఎం కేసీఆర్ కు దళితులు గుర్తురావటం సంతోషకరమని… దళితులు అండగా ఉండబట్టే ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్ళగలిగారని తెలిపారు. ఉద్యమంలో దళితులు తిండికి లేక ఇబ్బంది పడితే.. కేసీఆర్ ఒక్క రోజు కూడా ఉపవాసం లేడని.. దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మూడెకరాల భూమి హామీని నెలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

read also : తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల..

హుజూరాబాద్ లో ఉన్న 45 వేల దళితుల ఓట్లు కోసమే కేసీఆర్ జిమ్మిక్కులు అని.. దళితుల పుణ్యంతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని స్పష్టం చేశారు. దళితులే కేసీఆర్ ను బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. రాష్ట్రంలో దళితులపై వివక్ష ఉందనటానికి నేరెళ్ళ ఘటనే ఉదాహరణ అని తెలిపారు.

Exit mobile version