NTV Telugu Site icon

K. Laxman: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే నిందితులను శిక్షించండి.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

K Laxman

K Laxman

K. Laxman: రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిందితులను శిక్షించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తాం అన్నారు. కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఅర్ దుర్వినియోగం చేశారన్నారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్ధులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారని కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిన ఎందుకు కేసీఆర్ ను అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. టెలికాం రెగ్యులేటరీ ఆక్ట్ కి భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు.

Read also: Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు..

తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిందితులను శిక్షించాలన్నారు. రేవంత్ రెడ్డి కుర్చీ కోసం అధిష్టానానికి లొంగిపోతారా స్పష్టం చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. న్యాయ పోరాటానికి సైతం బీజేపీ సిద్దమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహిణుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే సిబిఐకి అప్పగించాలన్నారు. బీఎల్. సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడంకోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గం అని తెలిపారు. బీఆర్ఎస్ నీకృష్టమైన రాజకీయాలకు పాల్పడిందన్నారు. బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కాపాడిన రేవంత్ రెడ్డికి కూడా అదే గతిపడుతుందన్నారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్

Show comments