NTV Telugu Site icon

BJP Sabha: నేడు ఖమ్మంలో లక్ష మందితో బీజేపీ సభ.. హాజరుకానున్న అమిత్ షా..

Bjp Sabha

Bjp Sabha

తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఇప్పటికే తొలి జాబితాను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఇక, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బహిరంగ సభలు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే నేడు ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

Read Also: Boyapati Srinu : శ్రీ లీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బోయపాటి..

అయితే, నిన్నటి( శనివారం ) సభతో కాంగ్రెస్‌లో కొంత ఉత్సాహం పెరిగింది. కొత్త హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు దాన్ని మించిన స్థాయిలో తమ వ్యూహం ఉండాలని కమలం పార్టీ భావిస్తోంది. ఎందుకంటే.. ప్రజలు ఏ పార్టీ ఎలా ఉందో బేరీజు వేసుకుంటారు. అప్పుడు బీజేపీ డౌన్ ఉన్నట్లు అనిపిస్తే.. వారు కాషాయాన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా కమలదళం పార్టీ పక్కా ప్లాన్ వేస్తోంది.

Read Also: Devi Sri Prasad : మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఆశీర్వాదం తీసుకున్న రాక్ స్టార్..

ఇక, ఇవాళ ( ఆదివారం ) ఖమ్మంలో జరిపే బహిరంగ సభతో బీజేపీ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతుంది. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కంటే.. ఖమ్మంలో యాక్టివ్ పాలిటిక్స్ ఎక్కువగా కొనసాగుతాయి. ఇక్కడ, రాజకీయ ఎత్తుగడలూ ఎక్కువే.. అక్కడ ఇది వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్.. మార్చ్ సభ నిర్వహించారు. అది బాగానే సక్సెస్ అయ్యింది. దీంతో మళ్లీ బీజేపీలో ఉత్సాహం పెంచాలనుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఓ 22 మంది నేతలు బీజేపీలో చేరతారని కమలం పార్టీ నేతలు అంటున్నారు.

Read Also: Nandamuri Balakrishna: మా కుటుంబం.. మా కులం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య స్పీచ్

ఈ బహిరంగ సభకు రైతు గోస – బీజేపీ భరోసా అని పేరు పెట్టారు. తెలంగాణలో ప్రస్తుతం రైతులకు ధరణి సమస్య ఉంది.. చాలా మంది రైతులు ధరణిలో తమ భూముల రిజిస్ట్రేషన్, ఇతరత్రా అంశాలతో ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని ఇది వరకు బీజేపీ పార్టీ హైలెట్ చేసింది. దాంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి.. ధరణిలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. మొత్తంగా ధరణి విషయంలో రైతులకు ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకొని.. రైతులకు అండగా నిలవాలని బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నాయి. ఈ పాయింట్‌ని బీజేపీ కూడా గట్టిగానే ఒడిసి పట్టుకుంది.

Read Also: Boyapati Srinu: అఖండ 2 ఎప్పుడో చెప్పేసిన బోయపాటి శ్రీను

అయితే, ఇవాళ్టి సభను వర్షం పడినా ఇబ్బంది లేకుండా సభ ప్రాంగణం సెట్ చేశారు. లక్ష మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం సిటీలోని ఇల్లందు రోడ్డు – బైపాస్ రోడ్డు వెంట.. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఖమ్మం బహిరంగ సభకు వస్తారు అని బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు తెలిపారు.