Site icon NTV Telugu

PM MODI: రేపు హైదరాబాద్‌కు మోడీ.. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ

Pm Modi

Pm Modi

PM MODI: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మంగళవారం భారీ సమావేశం నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. సభ ఏర్పాట్లను పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. ఎజెండాతోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో తెలంగాణలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని ప్రకటించారు. బీసీ సీఎం విషయంలో బీజేపీ నేతలు ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. తెలంగాణలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న బీసీ ఓట్లను దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అయితే మరే ఇతర పార్టీ వారికి రాజ్యాధికారం ఇవ్వదనే కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని సమాచారం.బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే అందులో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారనేది బీజేపీ వ్యతిరేకులు. ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
Hyderabad Metro: మెట్రో సరికొత్త రికార్డు.. రోజూ 5.47 లక్షల మంది జర్నీ

Exit mobile version