MLC: తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher MLC: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థలతోపాటు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ పదవికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రజల్లోకి పాజిటివ్ వేవ్ పంపేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను నిలబెట్టి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తన అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ తరపున వెంకట నారాయణరెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. కడప పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర, ప్రకాశం పట్టభద్రుల అభ్యర్థి దయాకర్‌రెడ్డి, శ్రీకాకుళం పట్టభద్రుల అభ్యర్థి మాధవ్‌లను ప్రకటించారు.
Read also: C.V.Anand: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠా.. ముంబైలో మకాం వేసి..
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 24న.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27 వరకు ఈసీ గడువు ఇచ్చింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మార్చి 13న పోలింగ్ జరగనుండగా, మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ పదవికి ఓటు వేసేందుకు ప్రైవేట్ టీచర్లకు కూడా ఈసీ అవకాశం కల్పించింది. ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులే కీలకం కావడంతో వారిని మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Komatireddy Venkat Reddy: పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందే..!
తాజావార్తలు
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!