NTV Telugu Site icon

Bird Watch Festival: జనం అడవి బాట.. పక్షుల కోసం కెమేరాల వేట.. బర్డ్ వాచ్ ఫెస్టివల్

Adb Forest

Adb Forest

అందమైన పక్షులు..అంతకు మించి అడవి అందాల సొగసు..ఎగిరి సందడి చేసే పక్షుల కిలకిల రావాలు…ఆహ్లాదకరమైన వాతావరణం..భానుడి లేలేత కిరణాలు నేలను తాకుంటే అడవిలో అడుగులేస్తూ పక్షులను చూడ్డం…తమ కెమెరాల్లో బంధిస్తే ఆ కిక్కే వేరుకదా…ఇక కవ్వాల్ టైగర్ జోన్ లో అడుగుపెడితే ఆ థ్రిల్లింగే వేరు…ఎన్నో అనుభూతులు..ఎన్నో రకాల పక్షులను తమ కెమెరాల్లో బంధించిన పక్షి ప్రేమికుల ఆనందం అంతా ఇంతా కాదు..చెప్పలేని ఆనందం …పట్టలేని ప్రకృతి ప్రేమలో తడిసి ముద్దయ్యేలా చేసిందే బర్డ్ వాచ్ ఫెస్టివల్ ..ఇంతకీ బర్డ్ వాక్ , బర్డ్ వాచ్ ఫెస్టివల్ ఏంటీ…కవ్వాల్ టైగర్ జోన్ లో జరిగిన ఆవిశేషాలేంటో తెలుసుకుందాం.

కవ్వాల్ టైగర్ జోన్ అందరికి తెలుసు..దేశంలోని పులుల ఆవాసకేంద్రాల్లో ఇదొక్కటి..జన్నారం మండలంలోని ఎక్కువ భాగం విస్తరించిన ఈఅడవుల్లో ఇప్పుడు బర్డ్ వాచ్ పెస్టివల్ కు పెట్టింది పేరుగా మారిపోయింది…ఒక్కటి రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఇక్కడి అధికారులు .బర్డ్ వాచ్‌ ఫెస్టివల్ నిర్వహించి అడవిలోని మైసమ్మకుంట, గనిషెట్టి కుంట,కల్పకుంటలో పక్షిప్రేమికులు రెండు రోజుల పాటు బర్డ్ వాక్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు..పట్టణాల్లో తిరిగే వారంతా ఇప్పుడు అడవి బాటపట్టారు. భుజాన కెమెరాలు వేసుకుని పచ్చని అడవుల్లో కాలినడకన తిరగాడుతున్నారు…అరుదైన పక్షులను తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందంగా ముందుకు సాగారు, ఢిల్లీతోపాటు హైదరాబాద్ ,కరీంనగర్ ,ఆదిలాబాద్ ,తోపాటు సుదూర ప్రాంతాలనుంచి 72 మంది బర్డ్స్ లవర్స్ తరలి రాగా వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Read Also: Srisailam Traffic Jam: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్

ఉదయాన్నే జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో బర్డ్స్ ను తమ కెమెరాల్లో బంధించారు..వివిధ రకాల పక్షులను ఫోటోలు తీసి మురిసిపోయారు పక్షి ప్రేమికులు..దాదాపు 50 నుంచి వంద రకాల పక్షులను ఫోటోలు తీసినట్టు తెలిపారు…తమ కెమెరాల్లో బంధించిన ఫోటోలు ప్రత్యేక గ్యాలరీ లో డిస్ ప్లే చేశారు… ఈకార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి,కొమురం భీం జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజపాయి ,ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. ఎన్నో రకాల పక్షులను కుంటలు,అడవిలో తనివి తీరా చూడ్డమే కాకుండా తమ కెమెరాల్లో ఫోటోలు తీసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఔత్సాహికులు.

18 తేదీన వచ్చిన వారికి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళి అడవి ప్రాముఖ్యత,అందులో పక్షుల ప్రాముఖ్యతను అటవీశాఖ అధికారులు వివరించారు..ఇక 19 తేదీ ఉదయాన్నే సఫారి ద్వారా అడవిలోకి వెళ్ళిన పక్షి ప్రేమికులు వివిధ ఏరియాల్లో పక్షులను చిత్రాలు తీశారు..ఇలాంటి కార్యక్రమాల వల్ల అడవి గొప్పతనం ,వన్యప్రాణి సంరక్షణ,పక్షుల ప్రాముఖ్యత తెలుస్తుందని అందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. వయస్సుతో సంబంధంలేకుండా 72 మంది బర్డ్స్ లవర్స్ ఈఫెస్ట్ లో పాల్గొన్నారు..రెండు రోజులపాటు సాగిన ఈబర్డ్స్ వాచ్ ఫెస్టివల్ ఆనందాన్ని,అంతకు మించిన అనుభూతిని మిగిల్చిందంటున్నారు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఔత్సాహికులు.

Read Also: Tarakaratna : ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట.. అప్పట్లో సంచలనం

(ఆదిలాబాద్ ప్రతినిధి సారంగపాణి సౌజన్యంతో)