NTV Telugu Site icon

Bike thief: ఎంట్రా ఇదీ.. ఇలా కూడా చోరీ చేస్తారా?

Bike Thief

Bike Thief

Bike theft in Patan Cheru area: పార్కింగ్ వాహనాలు చేసే వాహనాలే టార్గెట్‌. ఎక్క‌డైనా వాహనాలు పార్కింగ్ చేసి ప‌నుల‌కు లోప‌ల వెళ్ళి బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి వాహ‌నదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగ‌త‌నానికి గురి కావడంతో ల‌బోదిబో మంటూ పోలీస్టేష‌న్ మొట్లు ఎక్కుతున్నాడు. న‌గ‌రంలోనే కాకుండా జిల్లాల వారిగా సీసీ కెమెరాలు వున్నా ఏమాత్రం జంక‌కుండా య‌దేశ్చగా దొంగ‌త‌నం చేసేందుకు వెన‌కాడ‌టం లేదు బైక్ దొంగ‌లు. జిల్లా వ్యాప్తంగా బైక్ దొంగలు రెచ్చి పోతూ రోజుకు ఎదో ఒకచోట బైక్ ల చోరీకి పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి ఏమీ తెలియనట్టు అది తన బైక్‌ అయినట్లు బైక్‌ పై అక్కడనుండి వెళ్లిపోయాడు. అది చూసిన వాళ్లకు కూడా అనుమానం రాదు ఎందుకంటే ఆ దొంగ అంతగా దొంగతనం చేశాడు. అలా వచ్చి బైక్‌ పై కూర్చొని ఇలా వెళ్లిపోయిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పరిధిలోని శాంతినగర్ కాలనిలో చోటుచేసుకుంది.

Read also: Hebah Patel: చీర కట్టిన హెబ్బా.. అబ్బా.. అంటున్న అబ్బాయిలు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని శాంతినగర్ కాలనిలో నివాసం ఉంటున్న శివారెడ్డి అనే వ్యక్తి 5 నెలల క్రితమే పల్సర్‌ బైక్‌ కొన్నాడు. రాత్రి తన బైక్‌ ను రోజూలాగేనే ఇంటి ముందు పార్కింగ్‌ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే దానిని గమనించిన ఓ దొంగ అలా వచ్చి బైక్‌ పై ఎక్కి తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఉదయం శివారెడ్డి చూడగా కంగుతిన్నాడు. తన బైక్‌ ఇక్కడే కదా పార్కింగ్‌ చేసింది ఎక్కడ పోయిందంటూ వెతికాడు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక తన బైక్‌ మాయమైందని గ్రహించిన శివారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. 5 నెలల క్రితమే బైక్ కొన్నానని అది చోరీకి గురైందని వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడున్న సీసీ ఫోటేజీని ప‌రిశీలించారు. ఇంటి ముందు పార్కు చేసిన బైక్ ను రాత్రి 2 గంటల సమయంలో ఎంత సులువుగా ఎత్తుకెళుతున్నాడో సీసీ ఫోటేజీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దొంగ ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరు లేరని తెలుసుకొని బండి తనదే అన్నట్టు ఎంతో దర్జాగా తీసుకెల్లాడు. అంతే కాదు ఎదురుగా సీసీ కెమెరా ఉంది అని తెలిసినా నాకెందుకులే అనుకున్నాడే ఏమో బైక్ తో పరార్ అయ్యాడు దుండ‌గులు. సీసీ కెమెరాలో రికార్డు అయినా ఈ దృష్యాల ఆధారంగా పోలీసులు బైక్ దొంగ‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.
V. Hanumantha Rao: బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పు