Site icon NTV Telugu

Singareni Old Mine: కుంగిన సింగరేణి పాత గని ఏరియా

Singareni 1

Singareni 1

సింగరేణి భూ గర్బ గనికి చెందిన ప్రాంతంలో బారీ ఎత్తున భూమి కుంగిపోయింది. దీంతో ఆప్రాంత వాసులు ఆందోళనలకు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గ్యాస్ లీక్ అవుతుందని చెప్పినప్పటికి అదికార యంత్రాంగం మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ప్రాంతంలో భూమి భారీగా కుంగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఇల్లెందు మున్సిపాలిటికి అనుకుని ఉన్న ప్రాంతంలో భూమి పెద్ద స్థాయిలో కుంగిపోయింది.

మొన్నటికి మొన్న ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుందని ఎన్టీవీ హెచ్చరించింది. ప్రత్యేక కథనం అందించింది. పూసపల్లి గని లో గతంలో సింగరేణి ఓపెన్ కాస్టు గని ఉండేది. అయితే ఆ గనిని ఎప్పుడో మూసి వేశారు. ఇక్కడ అడపా దడపా మూసి వేసిన గని ముఖ ద్వారంలో బొయ్యారం మాదిరిగా ఏర్పడుతుంది. గత నెలలో ఇదే ప్రాంతంలో గ్యాస్ బయటకు వచ్చి కుక్కలు, పిల్లులు, పిచ్చుకలు చనిపోయాయి. అప్పటిలోనే దీనిపై ఇక్కడ ప్రజలు ఆందోళనలు చేశారు. అయితే సింగరేణి మాత్రం పట్టించుకోలేదు. అయితే గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మూత పడ్డ గని ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. తిలక్ నగర్ గ్రామ పంచాయతి పరిధిలో ఈ గొయ్యి ఏర్పడింది. ఇక్కడ గతంలో పూసపల్లి భూగర్బ గని ఉండేది. ఇప్పుడా గని ఉన్న ప్రాంతంలో బారీ ఎత్తున గొయ్యి పడింది. ఈ గొయ్యి ఇప్పుడు ప్రజలను ఆందోళనలకు గురి చేస్తుంది. సింగరేణి యాజమాన్యం స్పందించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

Jagga Reddy: ఆరోజే ప్రకటిస్తా.. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు

Exit mobile version