NTV Telugu Site icon

BIG Breaking: నలుగురు TRS ఎమ్మెల్యేలకు వల.. పోలీసుల భారీ ఆపరేషన్

MLAS Sale

Bdccf0ff 5ba5 4d83 B810 Fc11ea0a56d9

హైదరాబాద్ లో పోలీసుల భారీ ఆపరేషన్ బయటపడింది. తెలుగు రాష్ట్రాలను ఇది షేక్ చేయనుంది.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం వల వేశారు. ఎమ్మెల్యేల బేరసారాలు బెడిసికొట్టాయి. తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్ లో పట్టుబడ్డవారిలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ వున్నారు.  పూర్తి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండె డ్‌ గా పట్టుకున్నారు పోలీసులు.. పట్టుబడ్డవారంతా బీజేపీ వారే అని తేలింది.

కాసేపట్లో పోలీసుల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ఆపరేషన్ లో పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు పేర్లు బయటకు వచ్చాయి.బీజేపీ ఆపరేషన్ బెడిసికొట్టింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఫిరాయింపుల కోసం నలుగురు TRS ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసులు దాడులు జరిపారు. రూ.15 కోట్ల వరకు నగదు దొరికినట్లు సమాచారం. నలుగురు TRS ఎమ్మెల్యేల్లో పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి, నందకుమార్‌లను పోలీసులు పూర్తి సాక్ష్యాలతో పట్టుకున్నారు. మునుగోడులో ఫిరాయింపుల కోసం ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. TRS ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.ఫామ్ హౌస్ కి చేరుకున్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఈ ఆపరేషన్ ని ఎన్టీవీ బ్రేక్ చేసింది.బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ అంబర్ పేట లో సెలబ్రేషన్స్ హోటల్స్ నిర్వహిస్తున్న నందు అనే వ్యక్తి కీలకంగా మారాడు. నందు ఒక మంత్రికి సన్నిహితుడుగా ప్రచారం సాగుతోంది.

 

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఏం చెప్పారంటే…

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. రామచంద్రభారతి సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారు. డబ్బులు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని చెప్పారన్నారు. ఫాం హౌస్ లో రైడ్ చేస్తే ముగ్గురు పట్టుబడ్డారు. రామచంద్రభారతి ఢిల్లీలో వుంటారు. తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజులు వచ్చారు. హైదరాబాద్ కి చెందిన నందకుమార్ S/o శంకరప్ప  ఇక్కడ వున్నారు. లీగల్ యాక్షన్ తీసుకుంటాం అన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. పార్టీ ఫిరాయింపుల కోసం వత్తిడి, ప్రలోభాలు పెట్టారన్నారు.