Site icon NTV Telugu

Komati Reddy: తెలంగాణలో కుటుంబ పాలన అంతమైంది.. ప్రజాపాలన ప్రారంభమైంది..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komati Reddy: తెలంగాణలో కుటుంబ పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా ఇవాళ నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాలలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి జనవరి 2న టెండర్లు ప్రారంభించి సంక్రాంతికి శంకుస్థాపన చేస్తామన్నారు.

Read also: Harish Shankar: రీమేక్స్ మాస్టర్… ఒరిజినల్ చూసినోడు కూడా విజిల్స్ వేయాల్సిందే

చిట్యా మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలోనే ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని మరోసారి రుజువు చేసిందన్నారు. డిసెంబర్ 3న అసలైన తెలంగాణ సిద్ధిస్తుందని.. 100 రోజుల్లో ఆరు హామీ పథకాలు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
Harish Shankar: రీమేక్స్ మాస్టర్… ఒరిజినల్ చూసినోడు కూడా విజిల్స్ వేయాల్సిందే

Exit mobile version