Site icon NTV Telugu

Bhatti Vikramarka: ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉంది..!

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రామన్నపాలెం, ఎర్రుపాలెం మండలం, మధిర నియోజకవర్గంలో భట్టి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు బందు చేస్తామని.. భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. దొరల ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ప్రజల సంపదని దోపిడి చేసి అత్యంత అవినీతిపరులుగా మారిన బీఆర్ఎస్ పాలకులు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకుల అవినీతి దోపిడి వల్లనే తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద ప్రజలందరి పంచాలన్న రాహుల్ ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. దళిత బంధు పథకం కంటే మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయ హస్తం పథకం తీసుకువచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యంగాస్త్రం వేశారు. రాష్ట్ర రాబడి, బడ్జెట్ పై ఆర్థిక లెక్కలు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను.. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉందన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు పాలకుల ఆర్థిక దోపిడిని అరికడితే చాలు… వాటిని అమలు చేయడం పెద్ద కష్టం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి దోపిడీకి తావులేదు. చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలనే బీఆర్ఎస్ కాపీ కొట్టి మేనిఫెస్టోగా ప్రకటించిందన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వలే, సబ్సిడీ ఎరువులు ఇవ్వలే, మద్దతు ధర ఇవ్వలే, మహిళలకు పావుల వడ్డీ రుణాలు ఇవ్వలే, పేదలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే తొమ్మిది రకాల నిత్యవసర సరుకులకు మంగళం పాడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మహస్తం పథకం అటక ఎక్కించి రేషన్ దుకాణాలను బియ్యం దుకాణాలుగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

మహిళలు పెళ్లీడు వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రెండు లక్షల పదహారువేల రూపాయల బంగారు తల్లి పథకాన్ని చంపేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తెచ్చి లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలను అర్హత కలిగిన ప్రతి ఇంటికి అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీల అమల్లో ఎలాంటి పక్షపాతం ఉండదు. కాంగ్రెస్ కి కుంచిత మనస్తత్వం లేదని, అన్ని పార్టీల వారికి ఇస్తాం కాంగ్రెస్ అందరి ప్రభుత్వముగా ఉంటుందన్నారు. 6 గ్యారెంటీలతో పాటు రైతు, మహిళ, దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల డిక్లరేషన్లు మేనిఫెస్టోలో పొందుపరిచి వాటిని కూడా అమలు చేస్తామన్నారు. మధిర నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది తప్పా… బీఆర్ఎస్ పాలనలో జరగలేదన్నారు.
పది సంవత్సరాలు అవుతున్న ఎర్రుపాలెం మండలానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు ఇవ్వలే, ఇండ్లు కట్టించలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, కనీసం రోడ్లను వెడల్పు చేయలే అంటూ మండిపడ్డారు. ఏళ్ల తరబడి వేచి చూస్తున్నా వితంతువులకు పెన్షన్లు ఇవ్వలే అన్నారు. జాలుముడి కాలువను కట్టింది కాంగ్రెస్.. కట్టలేరు ప్రాజెక్టును ఆధునికరించింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వు హయాంలోనే కొత్త రోడ్లు బడులు నిర్మాణం జరిగిందన్నారు.
Rashmika Mandanna : రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. స్పందించిన బిగ్‌ బీ

Exit mobile version